ఇండస్ట్రీ టాక్ : కాజల్ కెరీర్ ముగిస్తుందా?? ఇకపై తన ప్లానింగ్ ఇలా ఉందట.!

సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ క్రేజ్ సొంతం చేస్కున్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో గ్లామరస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కోసం కొత్త చెప్పాల్సిన పని లేదు. కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ ఆఫర్స్ సొంతం చేసుకొని తాను ఈ 2020, 2021 వరకు కూడా వెనక్కి తిరిగి చూడకుండా భారీ క్రేజ్ ని సొంతం చేసుకొని కెరీర్ పరంగా ఎలాంటి లోటు లేకుండా నెట్టుకొచ్చింది.

ఇక ఆమె కూడా పెళ్లి చేసుకుంది.. ఒక బాబు కూడా పుట్టాడు. దీనితో అందరి లానే కాజల్ కూడా తన కెరీర్ పరంగా కాస్త బ్రేక్ తీసుకుంది. అయితే ఈ బ్రేక్ ఇప్పుడు పర్మినెంట్ గా తీసుకుంటుందా లేక మళ్ళీ సినిమాలు రీస్టార్ట్ చేస్తుందా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ గా మారింది.

అయితే కాజల్ ఇప్పుడప్పుడే తన కెరీర్ కి ఎండ్ కార్డు వెయ్యాలి అనుకోవట్లేదట. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ లోకి దిగాలని చూస్తుందట అందులో భాగంగానే పలు సినిమా స్క్రిప్ట్స్ తో పాటుగా ఓటిటి వెర్షన్ కి కూడా వింటుందని తెలుస్తుంది.

దీనితో అయితే కాజల్ మళ్ళీ కొన్నాళ్లలో బిజీ అయ్యి సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మరి లాస్ట్ గా అయితే మెగాస్టార్ మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” సినిమాలో తాను నటించింది కానీ ఆమెపై సీన్స్ మేకర్స్ పెట్టలేదు.