‎Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

‎Kajal Aggarwal: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి మనందరికీ తెలిసిందే. చందమామ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు ఇండస్ట్రీలో దాదాపుగా స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రానా లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.

‎కొన్ని సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత  తొందరగానే పిల్లలు అవడంతో సినిమాలు చేయడం కాస్త తగ్గించేసింది. ఇప్పుడిప్పుడే సినిమాలలో మళ్లీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. బాలయ్య బాబు హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇటీవలే కన్నప్ప సినిమాలో పార్వతి దేవిగా కనిపించింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.



‎ అదేమిటంటే.. ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందని, ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. కొన్ని ఫోటోస్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. చివరకు ఈ వార్తలు కాజల్ దృష్టికి కూడా వెళ్లాయి. దీంతో ఆమె వెంటనే స్పందించింది. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వేదికగా యాక్సిడెంట్ రూమర్లను కొట్టి పారేసింది. నాకు రోడ్డు ప్రమాదం జరిగిందని, ఇక నేను లేను అంటూ ఒక నిరాధార వార్త లు వచ్చినట్లు నాకు తెలిసింది. అసలు ఇందులో ఎలాంటి నిజం లేదు. అది చూసి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. ఆ దేవుడి దయ వల్ల నేను చాలా బాగున్నాను. సురక్షితంగా ఉన్నాను. అలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని నేను కోరుతున్నాను. అలానే ఎవరికి స్ప్రెడ్ చేయవద్దని నేను దయతో ప్రార్థిస్తున్నాను. ఇలాంటి వార్తల కంటే సానుకూలత, నిజాలపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ కాజల్ అని రాసుకొచ్చింది.