Kajal Aggarwal: ఆ విషయంలో రిస్క్ చేస్తున్న కాజల్.. ఏ మాత్రం తేడా జరిగినా ఇక అంతే సంగతులు!

Kajal Aggarwal: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పెళ్లి అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఊపుతో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది కాజల్. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి పాన్ ఇండియా హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తెలుగులో చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటించి మెప్పించింది కాజల్ అగర్వాల్. తమిళంలో ఎక్కువ శాతం ఆమె అందాల ఆరబోతకే పరిమితమైందని చెప్పాలి. ఇక కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే అనగా 2020లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి బాబు కూడా జన్మించాడు. వివాహం తర్వాత కాస్త జోరుగా సినిమాలలో నటించినప్పటికీ ఈ మధ్యకాలంలో కాస్త అవకాశాలు తగ్గాయని చెప్పాలి. ఈ మధ్యకాలంలో కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలు కూడా సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 3 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నటుడు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన భారీ మైథిలాజికల్‌ కథా చిత్రం కన్నప్పలో పార్వతీదేవిగా నటించారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. కాగా ఇప్పుడు ఈమెకు కొత్త అవకాశాలేమీ లేవు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాలపై దృష్టి సారిస్తూ బిజీగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్‌ అగర్వాల్‌ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
ఈమె మళ్లీ ఫ్రైమ్‌ టైమ్‌ లోకి రావడానికి స్వీయ దర్శకత్వంలో హీరోయిన్ గా నటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీన్ని హిందీలో కమర్శియల్‌ అంశాలతో కూడిన కథా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే చాలా మంది సీనియర్‌ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను ఎంజాయ్‌ చేస్తూ, ఇతర వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా ఎంజాయ్‌ చేయకుండా రిస్క్‌ తో కూడిన దర్శకత్వం జోలికి ఎందుకు వెళ్లతారు? అని కొందరు స్నేహితులు కాజల్‌ కు హితవు పలుకుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో నిజానిజాల సంగతి పక్కన పెడితే నిజంగానే కాజల్ దర్శకురాలిగా మారుతుందా? ఒకవేళ ఈ విషయంలో రిస్క్ చేసి ముందు అడుగు వేసిన కూడా ఆ తర్వాత సక్సెస్ సాధిస్తున్న లేదా అన్నది చూడాలి మరి.