వైరల్ : “భవదీయుడు భగత్ సింగ్” లో అన్నీ ఉంటాయ్..క్రేజీ అప్డేట్..!

Bhavadeeyudu Bhagat Singh

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. ఇక ఈ గ్యాప్ లో పవన్ బర్త్ డే కూడా వస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ చాలా గ్రాండ్ గా ఈసారి వేడుకలు చేయడానికి ఫిక్స్ అయ్యారు.

దీనితో ఈసారి భారీ సెలెబ్రేషన్స్ కన్ఫర్మ్ కాగా ఆరోజుకి ప్లాన్ చేసిన పవన్ సినిమాల రీ రిలీజ్ లకు గాను మరింత స్థాయిలో క్రేజ్ కనిపిస్తుంది. ఇక ఈ హడావుడిలో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండగా పవన్ నటించబోయే “భవదీయుడు భగత్ సింగ్” టాపిక్ సోషల్ మీడియాలో రాగా.. 

వింటేజ్ పవన్ కళ్యాణ్ ని అదిరే ఎనర్జీ తో చూడాలి అనుకుంటున్నాం బహుశా ఇది హరీష్ శంకర్ సినిమాతో అవుతుందేమో అని ఫ్యాన్స్ హరీష్ ని అడగ్గా హరీష్ శంకర్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చేసాడు.

సినిమాలో అన్నీ ఉంటాయ్ ఏదీ కూడా మిస్సవ్వదు మీరు నేను చేస్తున్న వెయిటింగ్ కి సరిపడా ట్రీట్ భవదీయుడు భగత్ సింగ్ లో ఉంటుంది అని ఫ్యాన్స్ కి అదిరే అప్డేట్ ని అందించాడు. దీనితో అయితే ఈ సెన్సేషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.