పవన్ అభిమానులకు శుభవార్త

తెలుగులో సూపర్ డూపర్ హిట్ అందుకున్న “అత్తారింటికి దారేది” సినిమా తమిళ హక్కులు సొంతం చేసుకుంది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా. ఈమేరకు ఆ సంస్థ అధికారిక ప్రకటన కూడా చేసింది. “మెగా తెలుగు బ్లాక్ బస్టర్ ‘అత్తారింటికి దారేది’ తమిళ హక్కులు సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. దీని గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలను త్వరలోనే వెల్లడిస్తాము. త్రివిక్రంగారికి కృతజ్ఞతలు” అంటూ లైకా వారు ట్వీట్ చేశారు.

ఈ విషయం తెలియగానే ఒక్కో హీరో అభిమానులు తమ హీరో అయితే ఈ క్యారెక్టర్ కి సూట్ అవుతాడంటా రీట్వీట్స్ చేస్తున్నారు. తమిళ హీరోలు అజిత్ లేదా తలపతి విజయ్ పవన్ కళ్యాణ్ రోల్ కి సూట్ అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత క్యారెక్టర్లో సమంతానే ఉంటే బావుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కాస్టింగ్ కి సంబంధించిన వివరాలు కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది.