టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న చిత్రాల్లో తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న రెండో సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఇప్పటికే స్టార్ట్ అయ్యి కొంత మేర కంప్లీట్ అయ్యింది.
ఇక కొన్ని రోజులు కితమే సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాగా ఈ షెడ్యూల్ స్టార్ట్ చేయగానే ఏపీలో మారిన పరిస్థితులతో అయితే పవన్ మళ్ళీ బయటికి వచ్చేసారు. దీనితో షూటింగ్ పవన్ లేకుండానే కొన్ని సీన్స్ జరిగింది. మరి లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ గా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెట్స్ లో అడుగు పెట్టినట్టుగా తెలుస్తుంది.
కాగా దీనితో మేకర్స్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పవన్ తో స్టార్ చేయడమే ఓ భారీ పోరాట సన్నివేశంతో స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాగా ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లు కంపోజ్ చేసిన ఓ స్టన్నింగ్ ఏక్షన్ సీక్వెన్స్ తో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ హైదరాబాద్ లో భారీ సెట్టింగ్స్ నడుమ తెరకెక్కిస్తున్నారట.
మొత్తానికి అయితే మళ్ళీ పవన్ సినిమాలో పడ్డాడని చెప్పాలి. ఉన్న కొంత సమయంలో మేకర్స్ ఎంత ఎక్కువ వీలయితే అన్ని సీన్స్ పవన్ పై తీయాలని చూస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల అలాగే సాక్షి వైద్యలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.