పవన్ కళ్యాణ్ విషయంలో నిర్మాతల ధీమా అదే.!

అసలు పవన్ కళ్యాణ్‌తో నిర్మాతలు సినిమాలకు ఎలా కమిట్ అవుతున్నారు.? ఈ అంశంపై సినీ వర్గాల్లో ఒకింత చిత్రమైన చర్చే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పవన్ కళ్యాణ్ సినిమాల మీద అక్కడి అధికార పక్షం కన్నెర్రజేస్తోంది. నానా రకాల ఆంక్షలతో పవన్ సినిమాల్ని చంపేస్తున్న మాట వాస్తవం.

ఇంకోపక్క, పవన్ వేగంగా సినిమాలు చేయట్లేదు.. ఒప్పుకున్న సినిమాలూ పూర్తి చేయట్లేదు. ఈ విషయమై ఓ నిర్మాత తన సన్నిహితుల వద్ద కీలక వ్యాఖ్యలు చేశారట. ‘పవన్ మార్కెట్ ఎప్పుడూ డౌన్ అవదు. పవన్ ఒప్పుకుంటే చాలు.. అది నిర్మాతకు పెద్ద పండగే’ అని ఆ నిర్మాత వ్యాఖ్యానించాడట.

సదరు నిర్మాత ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా కోసం ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓకే అంటే, 150 కోట్ల పైన బడ్జెట్‌కి ఆయన రెడీ అట. ఎవరా నిర్మాత.? ఏమా కథ.? అన్నీ అనుకున్నట్టు జరిగితే, మార్చిలో అతని సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందట. ఓ మాస్ కమర్షియల్ డైరెక్టర్‌ని ఆ నిర్మాత లైన్లో పెట్టాడట.