Home Tollywood బండ్ల గణేష్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

బండ్ల గణేష్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

బండ్ల గణేష్ ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలైన తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో వేశాలు వేసేవారు. తర్వాతి కాలంలో టాప్ హీరోలతో సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో బడా నిర్మాతల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. పవన్ కళ్యాణ్ నాకు దేవుడంటూ బహిర్గతంగానే చెబుతుంటారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ జనసేనలో చేరవచ్చు అని భావించారంతా. కానీ అనూహ్యంగా బండ్ల కాంగ్రెస్ లో చేరారు. కాగా జనసేన అధినేత కూడా తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు కారణంగా ఆ రాష్ట్రంలో పోటీ చేయడం లేదని, ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ లో చేరినప్పటి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని చెబుతూ వచ్చారు బండ్లగణేష్. ఆయన తన సొంత నియోజకవర్గం షాద్ నగర్ నుండే పోటీ చేస్తాను అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆశలపై నీరు చల్లుతూ బండ్ల గణేష్ కి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయనకు స్థానికంగా ఉన్న వ్యాపార సంబంధాలు, సర్కిల్ కారణంగా అక్కడి నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తా అని భావించారు. ఆయనే పలు ఇంటర్వ్యూల్లో షాద్ నగర్ నుండే పోటీ చేస్తాను, గెలిచి చూపిస్తాను అంటూ ఛాలెంజ్ చేశారు కూడా.

కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఫైనల్ చేసిన జాబితాలో షాద్ నగర్ టికెట్ ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయానికి వచ్చారు. చౌలపల్లి ప్రతాప్ రెడ్డి స్థానికంగా బలమైన నాయకుడు. 2009 ఎన్నికలో ఇదే స్థానం నుండి గెలుపొందారు. కాగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నెలకొన్న విముఖత కారణంగా ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీఆరెస్ అభ్యర్థి వై.అంజయ్య యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఈసారి ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో ఉన్నారు ప్రతాప్ రెడ్డి. షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రజలకి చేరువ అవడానికి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటు టీఆరెస్ పార్టీ ఈసారి కూడా వై.అంజయ్యనే తమ అభ్యర్థిగా ప్రకటించటంతో… ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి బలమైన నాయకుడు ప్రతాప్ రెడ్డే అని భావించిన కాంగ్రెస్ ఆయనకే టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

దీంతో బండ్ల గణేష్ కు భంగపాటు ఎదురైంది. షాద్ నగర్ నియోజకవర్గం మీద గంపెడాశలు పెట్టుకున్న బండ్ల గణేష్ కు అసంతృప్తి మిగిలింది. బండ్లగణేష్ ను ఎక్కడి నుండి పోటీ చేయించనుంది కాంగ్రెస్ అనే చర్చ కార్యకర్తల్లో మొదలైంది. అసలు బండ్ల గణేష్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా చర్చలు మొదలయ్యాయి రాజకీయ వర్గాల్లో.

కాగా చివరి నిమిషంలో బండ్ల గణేష్ ను జిహెచ్ఎంసీ పరిధిలో సెటిలర్స్ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న ఏదైనా నియోజకవర్గంలో బరిలోకి దింపే ఛాన్సెస్ ఉన్నాయని గాంధీభవన్ లీడర్ ఒకరు తెలిపారు. మరి బండ్ల అక్కడ పోటీ చేస్తారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండి

Uttam Kcr | Telugu Rajyam

‘‘ తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి , దానం నాగేంద‌ర్‌, తీగల కృష్ణారెడ్డిలను పార్టీలో చేర్చుకొని పెద్ద పీట వేసినప్పడు మీకు సిగ్గు అనిపించలేదా? ’’

కెసియార్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ

 

 

- Advertisement -

Related Posts

బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ :...

ప్రభాస్ స్కై-ఫై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక స్కై ఫై సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

మాస్టర్ ఎఫెక్ట్.. రేటు పెంచిన సేతుపతి

మాస్టర్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా నెగిటివ్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతి మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. 96 హిట్టుతో హీరోగా ఏ రేంజ్ లో క్లిక్కయ్యాడో అందరికి తెలిసిందే. అయినా కూడా కేవలం...

మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్ !

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్...

Latest News