ఆ రోజు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మ‌రో బిగ్ అనౌన్స్‌మెంట్

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ మల్టీస్టారర్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిస్తున్న తాజా చిత్రం రీసెంట్ గా హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఆర్.ఆర్.ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. తన ప్ర‌తి సినిమాని వెరైటీగా ప్ర‌మోట్ చేసుకొనే రాజ‌మౌళి త‌న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ని కూడా విభిన్న రీతిలో జ‌నాల‌లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

చిత్రం టైటిల్ ద‌గ్గ‌ర నుండి, సెట్స్ పైకి వెళ్ళే విష‌యాలని కూడా ఫ్యాన్సీ నెంబ‌ర్స్ ద్వారా ప్రేక్ష‌కుల‌కి తెలియ‌జేస్తూ అభిమానుల‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపి తద్వారా సినిమాకు ప్రమోషన్ సంపాదించాలనుకుంటున్నారట. ఆ మ‌ధ్య ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించి నవంబర్ 11న ఉదయం 11 గంటలకు సినిమా ప్రారంభం అవుతుందని తెలిపాడు రాజ‌మౌళి. ఇప్పుడు మరో బిగ్ ఎనౌన్స్ మెంట్ కు డేట్ ఫిక్స్ చేసారట. డిసెంబ‌ర్ 12 మ‌ధ్యాహ్నం 12గం.ల‌కి (12-12-12) రాజ‌మౌళి మ‌రో బిగ్ అనౌన్స్‌మెంట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాజమౌళి త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్స్ కూడా టీంతో జాయిన్ అవనున్నార‌ని అంటున్నారు. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల స‌ర‌స‌న కీర్తి సురేష్‌, స‌మంత‌ల‌ని హీరోయిన్స్ గా ఎంపిక చేసిన‌ట్టు టాక్. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ… ప్రతి ఒక్కరూ అమితాసక్తితో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మా బ్యానర్‌లో తెరకెక్కించడం అదృష్టంగా భావిస్తున్నాను.నందమూరి, మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.వారి అంచనాలను మించేలా నిర్మాణంలో ఎక్కడా రాజీపడబోము.

సుమారు 200కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈచిత్రం 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.