(ధ్యాన్)
పవన్‌కల్యాణ్‌కి అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే… మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఓ హీరో, మరో మెగా హీరోకి బర్త్‌డే విషెస్ చెప్పడం వార్త కాదు. కానీ, ఇక్కడ పుట్టినరోజు పవన్‌కల్యాణ్‌ది కావడం, అల్లు అర్జున్ విషెస్ చెప్పడం కొంతమంది దృష్టిని ఆకర్షించింది. గతంలో ఒకానొక సినిమా ఫంక్షన్‌లో, ఒక ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ‘నేను చెప్పను బ్రదర్’ అని అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా! కొందరు అప్పటి అల్లు అర్జున్ మాటల్ని గుర్తు చేస్తున్నారు. పవన్‌కి బన్నీ బర్త్‌డే విషెస్ చెప్పాడని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి, పవన్-బన్నీ ఎప్పుడో కలిశారు. టీవీ ఛానల్స్ తీరుని నిరసిస్తూ, ఫిల్మ్ ఛాంబర్‌లో పవన్ హల్‌చల్ చేసిన సమయంలో అతడికి మద్దతుగా బన్నీ అక్కడికి చేరుకున్నాడు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫంక్షన్‌కి పవన్ వచ్చాడు. మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ హీరోలంతా ఎప్పుడో ఒక్కటి అయ్యారు. తమ మధ్య జరిగిన చిన్న చిన్న ఇష్యూలను మరిచిపోయారు. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలో మ్యాగ్జిమమ్ జనాలు పవన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానుల సంగతి చెప్పనవసరం లేదనుకోండి! సోషల్ మీడియా ఓ రేంజ్ హంగామా చేస్తున్నారు.
Happy Birthday Kalyan Babai . I really admire your efforts & struggle for a better society in-spite having the luxury of a comfortable life . Your sacrifice has won millions of hearts like mine . More Love and Power to you . #HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/OGPfCmlxK3
— Allu Arjun (@alluarjun) September 2, 2018