అక్కినేని అఖిల్ నాలుగో సినిమా ఎప్పుడనగానో ప్రారంభం అయింది. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ లో అఖిల్ పాల్గొంటున్నాడు కానీ ఇంతవరకు హీరోయిన్ ఖరారు కాలేదు. చాలా మందిని సంప్రదించగా చివరికి పూజా హెగ్డే ఖరారు అయింది. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. అదేంటంటే ఆమె అఖిల్ సరసన నటించడానికి ఒప్పుకుంది కానీ ఇప్పుడప్పుడే డేట్లు లేవంది. దాంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.
అఖిల్ కు ఇప్పటి దాకా హిట్ లేదు దాంతో కాస్త ఇమేజ్ ఉన్న పూజ లాంటి హీరోయిన్ తప్పనిసరి. అందువల్ల ఆమె కోసం షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఆమె అఖిల్ సినిమాకి డేట్లు ఇచ్చింది. ఇప్పుడెందుకు ఇచ్చింది అంటే, ఆమె ప్రభాస్ తో చేయబోయే తదుపరి సినిమా ప్రారంభానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ఆమె అఖిల్ సినిమాకి డేట్లు ఇచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు దర్శక నిర్మాతలు.