కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం బిక్కు బిక్కు మంటోంది. ఎక్కడికి వెళితే కరోనా పాకుతుందోనని భయం భయంగా గడిపేస్తున్నారు. కొంత మంది సెలబ్రిటీలు ఫారిన్ వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా తమ ప్రయాణాలని వాయిదా వేసుకుంటున్నారు. కొంత మంది స్టార్స్ షూటింగ్‌లని అర్థాంతరంగా రద్దు చేసుకుని మరో చోట షూటింగ్ చేయాలని, లేదా కొన్ని రోజులే షూటింగ్‌లని వాయిదా వేయాలని నిర్ణయించుకుంటున్నారు.
ఇదిలా వుంటే ప్రభాస్ టీమ్ మాత్రం `జాన్` సినిమా కోసం ఏకంగా జార్జియాకే వెళ్లింది. అక్కడ ఇప్పటికే ఓ ఛేజింగ్ సీన్‌ని పూర్తి చేసి మేజర్ షూటింగ్‌కు రెడీ అయిపోతోంది. ఇక్కడ ట్రాజెడీ ఏంటంటే పూజ హెగ్డేకి సంబంధించిన కీలక సన్నివేశాలని కూడా అక్కడే ప్లాన్ చేశారట. దీంతో పూజా టీమ్‌తో కలిసి జార్జియా పయనమైంది. ఇస్తాంబుల్ ఏయిర్ పోర్ట్‌కు చేరుకున్న పూజా ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన ఫొటోని పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో మూతికి మాస్క్, చేతులకి గ్లౌస్, కాళ్లకి షూస్ ధరించి కనిపింపిస్తోంది.
`సినిమాలంటే ప్రేమ. అందుకే జార్జియా వచ్చాను అని పూజా పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. పూజా డెడికేషన్, ప్రొఫెషనలిజమ్ చూసి నెటిజన్స్ పాపం పూజాహేగ్డేకి ఏంటీ పరిస్థితి? అని ఆశ్చర్యపోతున్నారు.