ఏ హీరోయిన్ అయినా హిట్ వచ్చి క్రేజ్ వచ్చిందంటే చాలు ఆ హరోయిన్ పెట్టే డిమాండ్లకు నిర్మాతలకు చుక్కలు కనపడాల్సిందే. ఇది ఒక్క హీరోయిన్ మాత్రమే కాదు హీరోలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఇకపోతే ఇప్పుడు హీరోయిన్ల విషయానికి వస్తే మాత్రం హిట్ కొడితే చాలు అమాంతం వాళ్ళ రేంజ్, డిమాండ్లు మారిపోతాయి.
ప్రస్తుతం నయన్‌తార టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఏదైనా పెద్ద స్టార్ సినిమా వస్తే ముందుగా హీరోయిన్ కోసం నయన్‌ను సంప్రదించాల్సిందే. అలాంటి నయనతార సినిమా ఒప్పుకునే ముందు నిర్మాతలకు ఖచ్చితంగా కండీషన్లు పెడుతుంది. తను ఆడియో ఫంక్షన్‌కు గానీ, సినిమా ప్రమోషన్స్, సక్సెస్ మీట్ కార్యక్రమాల్లో పాల్గొననని ముందే తేల్చేస్తుంది. అయినా టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు నయన్ కండిషన్‌ను సంతోషంగా ఒప్పుకుంటారు.అలా నయన్ ఎందువల్ల చేస్తుందంటే చాలాసార్లు తాను చెప్పింది ఒకటైతే, మీడియాలో వచ్చింది మరొకటని పేర్కొంది కథానాయిక నయనతార.గతంలో మీడియాలో తన గురించి రకరకాలుగా రాశారని, అవి చూసి చాలా బాధపడ్డానని, అందుకే అప్పటి నుంచీ తాను మీడియాకు దూరంగా ఉంటానని ఆమె చెప్పింది. అయితే ఆమె తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు అప్పుడ్పుపూ నెట్టింట్లో వైరల్ అవుతుండడం కామనే. ఇక వీరిద్దరూ త్వరలో ఒకటికానున్నారని సమాచారం.
తెలుగులో సీనియర్ హీరోల సరసన నటించే హీరోయిన్ అంటే కాజల్ అని చెప్పాలి. ఖైది నెం.150 తో చిరంజీవి సరసన నటించింది. ఎంతో మంది అగ్రహీరోలతో నటించిన ఘనత కాజల్ కి ఉంది. అంతేకాక దాదాపు మెగా హీరోలందరితో కాజల్ జతకట్టింది. ప్రస్తుతం పెద్దగా చేతిలో సినిమాలైతే ఏమీ లేవనే చెప్పాలి. అయినా కూడా కాజల్ పారితోషికం విషయంలో రాజీ పడడం లేదని, కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్. గతంలో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎం.ఎల్.ఏ. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కాజల్‌ని సంప్రదించారట. కల్యాణ్ రామ్ సరసన నటించడానికి ఒప్పుకొన్న కాజల్, అందుకోసం 1.75 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. దాంతో కాజల్‌కి ఇంత డిమాండ్ ఉందా? అంటూ దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. సినిమాల్లేనప్పుడు పారితోషికం తగ్గిస్తూ… ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంటారు కథానాయికలు. కానీ కాజల్ మాత్రం వెరైటీగా పారితోషికం పెంచుకొంటూ పోతోంది. దాని వెనుక ఉన్న మర్మమేమిటో..?? ప‌్రస్తుతం మంచు విష్ణు మోసగాళ్ళు, భారతీయుడు2 చిత్రంలో నటిస్తుంది.
ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లోని బిజీ స్టార్స్ లో ఒకరు. ఈ ఏడాది మహర్షి సినిమాతో హిట్ కొట్టిన పూజ, రీసెంట్ గా హిట్టైన గద్దలకొండ గణేష్ చిత్రంలో చిన్న పాత్రైనా కూడా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పూజ హెగ్డే సినిమాలకంటే ఆమె పారితోషికం ఎక్కువ హైలైట్ అవుతోంది. ప్రస్తుతం పూజ హెగ్డే ఒక సినిమాకు కోటిన్నర నుండి 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తోంది. సరిగ్గా గమనిస్తే ఈ భామ కెరీర్ లో నిఖార్సైన హిట్ ఒక్కటి కూడా లేదు. ఇటీవలే హిట్ అయిన సినిమాలు అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్ చిత్రాలలో ఆమె పాత్రలకు అంత ప్రాధాన్యం లేదు.
కన్నడ బ్యూటీ రష్మిక మండన్నడిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. చిత్రసీమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలన్న నానుడిని తు.చ తప్పకుండా అమలు చేస్తూ కెరీర్ ను మలచుకుంటోంది. తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక -చలోతో అడుగు పెట్టి గీత గోవిందంతో క్రేజీ గాళ్‌గా ఎదిగిపోయింది. వెంటనే సూపర్‌స్టార్ మహేష్ సరసన హీరోయిన్‌గానూ ఛాన్స్ దక్కించుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మికకు టాప్ డిమాండ్ ఉంది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో రష్మిక రెమ్యూనరేషన్ పెంచేసిందన్న న్యూస్ వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ అయిన రష్మిక, తాజాగా రెండోసారి విజయ్ దేవరకొండతో జోడీకట్టి ‘డియర్ కామ్రేడ్’లో నటించింది. ఇది ఇలా ఉండగా రష్మిక మండన్నపై సోషల్ మీడియాలో బోలెడు కథనాలు వెలువ డుతుంన్నాయి. రెమ్యూనరేషన్ బాగా పెంచేసి నిర్మాతలు. ఇక్కడ రెమ్యూనరేషన్ బాగానే తీసుకోవడం కాక అదే తరహాలో అటు కన్నడలో కూడా వస్తున్న ఆఫర్స్ కి ఓకే చెబుతూనే .. అక్కడ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. రష్మిక చెబుతున్న రెమ్యూనరేషన్ విని నిర్మాతలు షాక్ అవుతున్నారు. తెలుగులో తనకు నిర్మాతలు క్రేజ్ బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు .. మీరు ఎందుకు ఇవ్వరంటూ ఎదురు ప్రశ్నిస్తుందట రష్మిక. రష్మిక ఎవ్వారంతో నిర్మాతలు ఆమె పేరు చెబితేనె షాక్ అవుతున్నారు. ఈ విధంగా వీళ్ళు నిర్మాతలను భయపెడుతున్నారు.