Heroines: మామూలుగా హీరో హీరోయిన్లు ఒకే వేదికపై అందరూ ఒకే చోట కనిపిస్తే కలిగే ఆనందం వేరు. తమ ఫేవరెట్ హీరోలు అందరూ ఒకే వేదికపై కలిసినప్పుడు అభిమానులు చాలా సంతోషపడటంతో పాటు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉంటారు. అలా కనిపించినప్పుడు ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. హీరోయిన్లు అందరూ ఒకే వేదికపై కనిపించడం అన్నది చాలా అరుదు. మరి ముఖ్యంగా ఒకప్పటి అలనాటి హీరోయిన్స్ వేదికపై కనిపించారు అంటే అది అభిమానులకు పండగే అని చెప్పాలి. తాజాగా అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.
తాజాగా జూన్ 14వ తేదీ హైదరాబాదులో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకకు చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. అలాగే ఈ ఈవెంట్ కి అలనాటి హీరోయిన్స్ అయినా జయసుధ, జయప్రద, సుహాసిని లు హాజరయ్యారు. కాగా జయసుధ తెలంగాణ గద్దర్ అవార్డుల జ్యురి కమిటీలో మెంబర్ గా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ వేడుకకు హాజరయ్యారు. డైరెక్టర్ మణిరత్నంకు తెలంగాణ ప్రభుత్వం పైడి జైరాజ్ అవార్డ్ ఇవ్వడంతో తన భర్తతో కలిసి సుహాసిని ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక జయప్రద స్పెషల్ గెస్ట్ గా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ముగ్గురు అలనాటి హీరోయిన్స్ ని ఒకేసారి స్టేజిపైకి పిలిచి వారిచేత పలు అవార్డులు సైతం ఇప్పించారు.
దీంతో ముగ్గురు లెజెండరీ నటీమణులు స్టేజిపై ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. చాలా రోజుల తర్వాత ఇలా ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ కలిసి కనిపించడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జయసుధ, సుహాసిని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో అడపాదడపా నటిస్తున్నారు. జయప్రద మాత్రం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్స్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన ఈ ముగ్గురు హీరోయిన్లు చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ అందమైన ఫోటో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
