పొలిటికల్ ప్రచారానికి లచ్చలడుగుతున్న గ్లామర్ భామలు.!

ఎన్నికల ప్రచారమంటే మాటలా.? అభ్యర్థులు కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌కి మాత్రం లక్షల్లోనే లెక్క చూపిస్తార్లెండి. అదంతే, ఆ రాజకీయమే అంత.! రాజకీయాల్లో సినీ గ్లామర్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఎప్పుడు ఎన్నికలు జరిగినా, సినీ జనాలకీ పండగే. అందునా, కొందరు అందాల భామలకు అదో స్పెషల్ పండగ. అభ్యర్థుల తరఫున, పార్టీల తరఫున ప్రచారం కోసం సినీ తారలు వెళ్ళడం మామూలే. అలా వెళ్ళే క్రమంలో గట్టిగానే రెమ్యునరేషన్ అందుకుంటుంటారు.

విలువలు, వంకాయలూ ఏమీ లేవిక్కడ. ఎవరన్నా అభ్యర్థి అడిగితే ఎన్నికల ప్రచారానికి ‘సై’ అంటున్నారు అందాల భామలు. అయితే, లక్షల్లో రెమ్యునరేషన్లు అడుగుతున్నారట. ‘రోజువారీగా మాకు సినిమాల్లో దక్కే పేమెంట్ కంటే, రెండింతలు.. పదింతలు.. ఇస్తే తప్ప వచ్చేది లేదు’ అని స్థాయిని బట్టి ఆయా అందాల భామలు చెబుతున్నారట.

ఆల్రెడీ కొందరు అందాల భామలతో పొలిటికల్ లీడర్స్ డీలింగ్స్ సెట్ చేసేసుకున్నారట తెరవెనుకాల. అయితే, ఈ పేమెంట్లకు సంబంధించి లెక్కలేమీ పైకి కనిపించవు. ఫలానా అభ్యర్థి చిత్తశుద్ధి నచ్చి.. అని కవరింగుల ఇస్తుంటారు నటీనటులు.

కారవాన్లూ, లగ్జరియస్ హోటళ్ళు.. ఇలా ఆయా అందాల భామలు బస చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా రాజకీయ పార్టీలు చేసుకోవాల్సి వుంటుంది. అభ్యర్థులు సగం, పార్టీలు సగం ఖర్చు పెడుతుంటాయి సాధారణంగా.

తాజాగా, ఓ అందాల భామ చెప్పిన రెమ్యునరేషన్ ఫిగర్‌కి ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మైండ్ బ్లాంక్ అయి, గుడ్లు తేలేశాడట. ఎవరా భామ.? ఏమా కథ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.!