మోక్షజ్ఞ కోసం… రాజమౌళికి టెండ‌ర్ పెట్టిన బాల‌య్య‌

నందమూరి బాలకృష్ణ తన తనయుడు మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ విషయంపై స్పందించారు. మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడేళ్ల కిందటే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం గురించి సినీ వర్గాల్లో చర్చ జరిగింది. అదిగో.. ఇదిగో.. అంటూ అప్పుడే గుసగుసలు వినిపించాయి అయితే ఇప్పటివరకూ అలాంటి హడావుడి ఏమీలేదు. తాజాగా తన కుమారుడి సిని రంగ ప్రవేశంపై బాలకృష్ణ ఒక కీలక ప్రకటన కూడా చేసారు. “చదువుకునే రోజుల్లో వాడి దృష్టి పూర్తిగా చదువు మీదే ఉండేది. ఇప్పుడు సినిమాల గురించి కూడా ఆలోచిస్తున్నాడు. సినిమాలకు సంబంధించి తన ఆలోచనలను నాతో పంచుకుంటున్నాడు. కచ్చితంగా ఏదో ఒక రోజు మోక్షజ్ఞను వెండితెరపై చూస్తారు. అయితే అదెప్పుడన్నది ఇప్పుడే చెప్పలేనని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. వాస్తవానికి బాలకృష్ణ గత ఏడాది క్రిష్ తో సినిమా చేయించాలి అని భావించారట. కాని అది అంతగా ఫలించకపోవడంతో వెనక్కు తగ్గినట్టు ప్రచారం ఎక్కువగానే జరిగింది. తాజాగా బాలకృష్ణ ఆ ప్రకటన చేయడంతో ఒక వార్త బయటకు వచ్చింది.

త‌న కొడుకును జ‌క్క‌న లాంచ్ చేస్తే బావుంటుంద‌ని బాల‌య్య భావిస్తున్న‌ట్లు స‌మాచారం. రాజమౌళి కోసం బాలకృష్ణ ఆగుతున్నారని అంటున్నారు. ఈ ఏడాది రాజమౌళి తో సినిమా చేయించాలి అని చూసినా సరే అది ఫలించలేదని, అందుకే ఈ ఏడాది కూడా అది సాధ్యం కాలేదని.. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఆ సినిమా పూర్తి కాగానే ఈ సినిమాను ముందుకి తీసుకువెళ్ళే ఆలోచన బాలకృష్ణ చేస్తున్నారని, రాజమౌళి బిజీ గా ఉండటమే ఆలస్యానికి కారణమని అంటున్నారు. నిర్మాతగా కూడా తానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. బాల‌య్య ఫ్యాన్స్ మోక్ష‌జ్ఞ కోసం చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నార‌న్న విష‌యం తెలిసిందే.