Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ.. బాలయ్య సన్నాహాల్లో వేగం!

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడిగా తెరపైకి రావాల్సిన మోక్షజ్ఞ తేజ ఎంట్రీపై చాలా కాలంగా ఎదురుచూపులే. బాలకృష్ణ తనయుడిగా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడినా, ఇప్పటివరకు ఎలాంటి సినిమా ప్రారంభం కాలేదు. అయితే తాజాగా బాలకృష్ణ-మోక్షజ్ఞ కాంబినేషన్‌పై కీలక సమాచారం బయటకు వచ్చింది.

మొదట మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తాడని అధికారికంగా ప్రకటించారు. అయితే సినిమా ప్రారంభం గురించి ఎన్నో వార్తలు వచ్చినా ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. అయితే బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై సైలెన్స్ పాటిస్తున్నా, దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.

ఇక మరోవైపు, బాలయ్య సూపర్ హిట్ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ గురించి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తాజాగా మాట్లాడారు. ఈ కథను బాలకృష్ణే స్వయంగా తెరకెక్కించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అంటే, మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్న బాలయ్య ఆలోచనలో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బాలయ్యే ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ‘ఆదిత్య 369’ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, ప్రాజెక్టును మళ్లీ మొదలుపెట్టాలని బాలకృష్ణ ఆసక్తిగా ఉన్నట్టు టాక్. ఈ సినిమా రీ రిలీజ్ అయిన సందర్భంగా కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌పై ఆసక్తి పెరిగింది. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఆ సినిమా ద్వారానేనా? లేదా వేరే కథతోనా అన్నది త్వరలో తేలనుంది. అభిమానులు మాత్రం ఆయన తెరపై ఎప్పుడొస్తారో తెలుసుకోవాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బ్లాక్‌లో ప్రమాదం || Fire Accident in AP Secretariat Updates || Pawan Kalyan || TR