Mokshagna: సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది నందమూరి వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ బాలకృష్ణ మాత్రమే సక్సెస్ అందుకున్నారు ఇక తర్వాతి తరంలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు . ఇక బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కనుక ఇండస్ట్రీలోకి వస్తే మరో స్టార్ హీరోగా మారుతారని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.
ఇలా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు గత దశాబ్ద కాలం నుంచి మోక్షజ్ఞ రాక కోసం ఎదురు చూడటమే కాకుండా ఆయన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మోక్షజ్ఞ వెండితెరపై కనిపిస్తే చాలు ఆయనని స్టార్ హీరోని చేసేస్తాం అంటూ అభిమానులు కూడా గట్టిగా ఫిక్స్ అయ్యారు.
ఇక మోక్షజ్ఞ సినీ రాక కోసం అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే బాలయ్య కూడా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఇంటి ఉండబోతుందని వెల్లడించడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో భారీగా అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. దీంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.
డైరెక్టర్ ప్రశాంత్ మోక్షజ్ఞతో కాకుండా ప్రభాస్ తో మరో సినిమాకు కమిట్ అయ్యారని ఈ సినిమా పూర్తి అయ్యేవరకు ఆయన ఇతర సినిమాలను చేసే ఆలోచనలు లేరని తెలుస్తుంది. ఇలా ప్రశాంత్ హ్యాండ్ ఇవ్వడంతో బాలయ్య మరో డైరెక్టర్ కోసం వేట మొదలుపట్టారట. అయితే మోక్షజ్ఞ సినీ కెరియర్ ఇలా కావడానికి కారణం బాలకృష్ణ అనే అంటూ అభిమానులు భావిస్తున్నారు.
బాలకృష్ణ తన కుమారుడు కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయారు ఈయన రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో తన కొడుకు కెరియర్ పై ఫోకస్ చేయలేక సరైన డైరెక్టర్ ను ఎంపిక చేసుకోలేకపోయారని అభిమానులు వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సాధారణంగా హీరోగా వారసులు 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఇండస్ట్రీలోకి వస్తారు కానీ మోక్షజ్ఞ మాత్రం 30ఏళ్లు దాటిన ఇప్పటికీ ఇండస్ట్రీలోకి రాలేకపోతున్నారు. ఇలా ఈయన ఇంత ఆలస్యంగా రావడానికి తనకు సినిమాలపై ఆసక్తి లేదని తెలుస్తోంది. ఇలా ఆసక్తి లేకపోయినప్పటికీ బలవంతంగా బాలకృష్ణ తనను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారని సమాచారం.