కాళ్లు గోడ‌కి..చేతులు నేల‌కి.. ఇదేంటి?!

Pooja Hegde Fixes a peg for her Dad

లాక్ డౌన్ తో ఎవ‌రి ఇళ్ల‌లో వాళ్లు బిజీ. డైరెక్ట‌ర్లు అంతా స్ర్కిప్ట్ లు రాసుకుంటూ సినిమాలు స్ట‌డీ చేస్తున్నారు. హీరోలంతా అవేర్ నేస్ అంటూ పాఠాలు బోధిస్తున్నారు. హీరోయిన్లు అంతా యోగాలు…జిమ్ములు అంటూ రూప లావాణ్యాన్ని చెక్కే ప‌నిలో ఉన్నారు. ఇంకా స‌మ‌యం ఉంటే కిచెన్ రూమ్ లో తెలిసి తెలియ‌ని ప్ర‌యోగాలు చేస్తూ..వాటిని ఇన్ స్టా లో షేర్ చేస్తూ ప్ర‌చారం పొందుతు న్నారు. ఇటీవ‌లే పూజా హెగ్దే వంట గ‌దిలో ఏదో రెసిపీ ప్రిపేర్ చేసింది. ప‌సుపు వర్ణంలో ఉన్న దేవుడి ప్ర‌సాదంలా ఉంది. మ‌రి ఆ టెస్ట్ బుట్ట‌బొమ్మకే తెలియాలి.

తాజాగా అమ్మ‌డు హాట్ హాట్ గా ఆస‌నాలు వేస్తూ కాలం గ‌డుపుతోంది. ఇంటినే ఆస‌నాల శాల‌గా మార్చేసింది. కింద ఎర్ర‌టి తివాచీ పరిచి చేతులు నేల‌కానిచ్చి…అటుపై కాళ్లు గాల్లోకి లేపి అటుపై 90 డిగ్రీలు కాళ్ల‌ను తిప్పి ఎదురుగా ఉన్న గోడ‌కు ఆన్చింది. చూస్తుంటే ఇదొ కొత్త ర‌కం ఆస‌నంలా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా ఆస‌నాలకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. కానీ ఇలా నేల‌..గోడ‌ను ఆధారం చేసుకుని వేసిన ఆస‌నం మాత్రం ఇదే. నేటి జ‌నులు అమ్మ‌డి ఆస‌నం దాని పేరేంటో చెప్పండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అస‌లే అమ్మ‌డు ఆర‌డుగుల‌కు పైగా ఎత్తు ఉంటుంది. దీంతో నేల‌కి చేతుల‌కు..కాళ్ల‌కు మ‌ధ్య దూరం బాగా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అనిపిస్తోంది. ఆస‌నం కూడా బాగా ఎలివేట్ అవుతుంది. మ‌రి ఈ ఆస‌నం పేరోంటే అమ్మ‌డే చెప్పాలి. ప్ర‌స్తుతం పూజా హెగ్దే ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న జాన్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఇంకా మరికొన్ని సినిమాలు చేతిలోఉన్నాయి. కోలీవుడ్ల ఓ విజ‌య్ 65వ చిత్రంలోనూ ఎంపికైంది.