ఇవీ పూజా హెగ్డే పెట్టే షరతులు!!

ఆ మధ్య ఒక సినిమా చేసి కనుమరుగై మళ్ళీ బాలీవుడ్ కు తరలి వెళ్లి అక్కడ అదృష్టం కలిసి రాక మళ్ళీ ఇక్కడికి వచ్చి గ్లామర్ రోల్స్ తో హిట్ కొట్టింది. అలా వరుస పెట్టి అగ్ర హీరోల సరసన సినిమాలు చేస్తున్న భామ పూజ హెగ్డే.

ఈ మధ్య ఏ హీరో పక్కనైనా ఈమె. అల్లు అర్జున్, నాగ చైతన్య, వరుణ్ తేజ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా ఒకరేమిటి పెద్ద హీరో పెద్ద సంస్థలు ఏ చిత్రమైనా అందులో ఈమె. అందువల్ల తన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈమె ఈ మధ్య నిర్మాతలకు తెగ షరతులు పెడుతోందట.

అందులో ఒకటి షూటింగ్ ముందు రోజే తనకు డైలాగ్ పేపర్ ఇచ్చేయాలట. ఇంకా ఏమేమి షరతులు ఉన్నాయో తెలీదు కానీ మచ్చుకు ఇది ఒకటి. ఏది ఏమైనా హిట్లు ఇస్తున్నంత కాలం తానేం చేసినా చెల్లుతుందనే సూత్రాన్ని బాగానే ఒంట బట్టించుకుంది కదూ.