Shanmukh – Deepthi:బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది చాలా మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వారి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అందుకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పాలి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు కూడా దారుణంగా నెగిటివిటీ ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో యాంకర్ రవి ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్, సిరి అని చెప్పాలి.యాంకర్ రవికి కూడా బయట ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు అనంతరం తన కుటుంబం గురించి వస్తున్న ట్రోలింగ్ పై పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ఇకపోతే సిరి షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో ఎంతో చనువుగా ఉండటం వల్ల షణ్ముఖ్ జస్వంత్ లవర్ దీప్తి సునయన తణుకు బ్రేకప్ చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇలా వీరి బ్రేకప్ తర్వాత ఎవరి లైఫ్ లో వారు ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన మొట్టమొదటిసారిగా కలిసిన ఫోటోని షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇదిలా ఉండగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
కొందరు దీప్తి సునైనా సరైన నిర్ణయాన్ని తీసుకుంది అంటూ కామెంట్ చేయగా మరికొందరు వీరిద్దరూ కలిస్తే చాలా బాగుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిస్తే దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ కి కండిషన్స్ పెట్టనుందని, ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే తనతో తన రిలేషన్షిప్ కొనసాగిస్తుందని చాలామంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.నిజంగానే వీరిద్దరు కలవాలంటే షణ్ముఖ్ జస్వంత్ కండిషన్స్ ఒప్పుకోవాల్సిందేనని వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.