Sukumar : షరతులు వర్తిస్తాయి అంటున్న సుక్కు… పుష్ప 3 గురించి హింట్ ఇస్తాడా..?

Sukumar : పుష్ప సినిమా తీసినపుడు పాన్ ఇండియా లెవెల్ లో అంత హిట్ అవుతుందని చిత్ర యూనిటుకూడా అనుకోలేదేమో. పుష్ప ఎంతలా హిట్ అయిందంటే ఇండియా మొత్తం పుష్ప ఫీవర్ పట్టుకుంది. సామాన్యులతో మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరు సినిమా లోని పాటలకు స్టెప్పులేసారు. బన్నీ మానేరిజం ను అనుకరించారు.ఇటీవలే సౌరవ్ గంగూలీ కూడా తగ్గేదేలే అంటూ బన్నీ డైలాగ్ ను అనుకరించడం అభిమానులకు తెగ నచ్చింది.

ఇక పుష్ప విజయం తర్వాత పుష్ప 2 ది రైస్ కోసం సుకుమార్ , బన్నీ చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అంచనాలు పెరగడం తో జాగ్రత్తగా పుష్ప 1 కంటే పుష్ప రెండవ భాగం మరింత ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నారు. పుష్ప 2కి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం తమిళనాడులోని కూనూర్‌లో.. క‌థా చ‌ర్చ‌లు మొద‌ల‌వ్వ‌బోతున్నాయి. సుకుమార్‌తో పాటుగా త‌న స‌హాయ ద‌ర్శ‌కులు, కొంత‌మంది కీల‌క‌మైన సాంకేతిక నిపుణులు కూనూర్‌లో వెళ్తున్నారు. ఎండ‌లు కాస్త త‌గ్గాక‌, అంటే జూన్‌, జులైలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లెట్టాల‌ని చూస్తున్నారు.

అయితే సుక్కు పుష్ప మూడవ భాగం కూడా తీయాలనీ అనుకుంటున్నారట. పుష్ప రెండవ భాగం. లో ఇందుకు సంబంధించిన ట్విస్ట్ ను ఇవ్వబోతున్నారట అయితే ఇదంతా పుష్ప రెండవ భాగం హిట్ అయితే నే అంటున్నారు సుకుమార్.కాక‌పోతే.. పుష్ప 2కీ, పుష్ప 3కీ మ‌ధ్య చాలా గ్యాప్ ఉంటుంద‌ట‌. ఈలోగా సుకుమార్ ఓ సినిమా, బ‌న్నీ మ‌రో సినిమా చేసుకొస్తారు. ఆ త‌ర‌వాతే పుష్ప 3 ఉంటుంది. అయితే దీనికీ కండిష‌న్లు అప్లై అవుతాయి. అదీ ప్ర‌స్తుతానికి సుకుమార్ లెక్క‌.