అరుదైన ఘనత దక్కించుకున్న ‘రంగస్థలం, మహానటి’ సినిమాలు

మహానటి సావిత్రి జివ్విత కదా ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’, రాంచరణ్-సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ రేసులో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీ రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక గ్రాసర్ గా నిలిచింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన మహానటి గురించి చెప్పక్కర్లేదు. అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఈ బయోపిక్. సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు టాలీవుడ్ కి అరుదైన ఘనతను తెచ్చిపెట్టబోతున్నాయి.

‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ మెల్బోర్న్ 2018’ లో ఈ రెండు సినిమాలు ప్ప్రదర్శింపబడనున్నాయి. ఆగష్టు 10 నుండి 22 వరకు జరగనున్న ఈ ఫిలిం ఫెస్టివల్ లో రంగస్థలం, మహానటి సినిమాలు ఉత్తమ్ చిత్రం కేటగిరిలో పోటీ పడనున్నాయి. రంగస్థలం మూవీకి గాను ‘ఐఎఫ్ఎఫ్ఎమ్‌’ నుండి రాంచరణ్ కి ఆహ్వానం అందింది. రంగస్థలం మూవీ ప్రదర్శన రోజుకి రాంచరణ్ అక్కడికి చేరుకోనున్నట్టు సమాచారం. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ సహాయనటిగా సమంత నామినేట్ అయ్యారని తెలుస్తోంది.