చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలను పక్కన పెట్టేసి ఫ్యామిలీ లైఫ్ కి ఫుల్ టైం కేటాయిస్తారు. వారికి పిల్లలు పుట్టి కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక అక్క, వదిన, అమ్మ క్యారెక్టర్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారు. ఈమధ్య ఆ ట్రెండ్ కాస్త మారింది. పెళ్లి అయ్యాక కూడా భర్తల సపోర్ట్ తో మూవీస్ కంటిన్యూ చేస్తున్నారు ఈ తరం హీరోయిన్లు. ఆ కోవకే చెందుతుంది అక్కినేని వారి కోడలు సమంత. గత కొద్దీ రోజులుగా స్యామ్ సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అనే వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. వాస్తవమెంతో తెలియకపోయినా ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది. ఇక సమంత సినిమాలకు గుడ్ బై చెప్పటానికి కారణం అదే, కారణం ఇదే అంటూ నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ రూమర్ పై రీసెంట్ గా నాగచైతన్య స్పందించారు. సమంత ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఆ సినిమాల తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటుందేమో కానీ సినిమాలను పూర్తిగా వదిలిపెట్టదు అని తేల్చి చెప్పాడు నాగచైతన్య. త్వరలోనే మా ఇద్దరినీ జంటగా ఒకే సినిమాలో చూడవచ్చు అని కూడా తెలిపాడు. దర్శకుడు శివ నిర్వాణ ఒక కథతో మా దగ్గరకు వచ్చారు. ఆ స్టోరీ ఒక పెళ్లి అయిన జంట మధ్య నడుస్తుంది. అందుకే ఆ సినిమాలో మా ఇద్దరినీ నటించమని డైరెక్టర్ సూచించగా… మాకు సూట్ అయ్యే కథ అనిపించి అందులో యాక్ట్ చేయడానికి ఇద్దరం ఒప్పుకున్నాము అని తెలియజేసాడు చైతు. మొత్తానికి స్యామ్ సినిమాలను విడిచిపెట్టదు అనే క్లారిటీ అయితే ఇచ్చేసాడు. మరి ఇప్పుడైనా ఆ పుకార్లకు బ్రేక్ పడుతుందో లేదో.