అప్పుడే మా స్నేహం మొదలైంది.. చై తనకి అక్కడే ప్రపోజల్ చేశాడంటున్న శోభిత!

రెండు సంవత్సరాల ప్రేమ తర్వాత ఇటీవల డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య, శోభిత. ఇరు కుటుంబాలు, కొద్దిమంది స్నేహితుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగార్జున విగ్రహం ముందు శోభిత మెడలో తాళి కట్టాడు నాగచైతన్య. పెళ్లి తర్వాత ఈ జంట ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో వారిద్దరి పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి చాలా విషయాలను మాట్లాడారు. 2018లో శోభిత మొదటిసారి నాగార్జున ఇంటికి వెళ్లినట్లు, 2022 ఏప్రిల్ తర్వాత చైతు తో తన స్నేహం మొదలైందని చెప్పుకొచ్చారు.

శోభితకే ఫుడ్ అంటే చాలా ఇష్టమట చైతన్య తన ఇన్స్టా స్టోరీలో తన రెస్టారెంట్ గురించి పోస్ట్ చేసినప్పుడు శోభిత రిప్లై ఇచ్చిందట అలా తమ స్నేహం మొదలైందని, చైతన్య ఎప్పుడు ఫుడ్ గురించి అడగటం ఇద్దరూ ఎక్కడ కలిసిన ఫుడ్ గురించి మాట్లాడుకునేవారట. అలాగే నాగచైతన్య శోభిత ని తెలుగులోనే మాట్లాడాలని అలా మాట్లాడటం వలన అతని తెలుగు బలపడుతుందని చెప్పేవాడంట. మొదటిసారి ఈ ఇద్దరు ముంబైలోని ఒక కేఫ్ లో కలిసినట్లు చెప్పింది శోభిత.

మొదటిసారి మేమిద్దరం బయటికి వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్ తను బ్లూ సూట్ లో ఉన్నాం, ఆ తర్వాత ఇద్దరం కర్ణాటకలోని ఒక పార్క్ కి వెళ్ళాము ఒకరికి ఒకరం గోరింటాకు పెట్టుకున్నాం,ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కి వెళ్ళాము ఇక అక్కడ నుంచి జరిగిందంతా అందరికీ తెలిసిన విషయమే అని చెప్పింది శోభిత. నాగచైతన్య కుటుంబం తనని నూతన సంవత్సర వేడుకలకు ఆహ్వానించిందని ఆ మరుసటి సంవత్సరం నాగచైతన్య తన కుటుంబాన్ని కలిసినట్లు చెప్పింది.

ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తరువాత గోవాలో నాగచైతన్య తనకి ప్రపోజల్ తీసుకువచ్చినట్లు తెలిపింది. గోవా నుంచి వచ్చిన వెంటనే నిశ్చితార్థం పెట్టుకున్నారంట ఈ జంట. అయితే నెటిజన్స్ మాత్రం వీరిద్దరూ 2022 లో డేటింగ్ ప్రారంభించారని, వీటికి సంబంధించిన ఫోటోలు చాలాసార్లు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయని చెప్తున్నారు.