వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

దివంగత నేత వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యాత్ర’. మహి రాఘవ్ దర్శక బాధ్యతలు నిర్వహిస్తుండగా మమ్ముట్టి వైఎస్సార్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణ సారధ్యంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ బయోపిక్ నిర్మిస్తున్నారు.

తాజాగా చిత్ర యూనిట్ ఈ బయోపిక్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించింది. జులై 8 న వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 69 వ జయంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

https://platform.twitter.com/widgets.js