డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు.. నెలకు 80 వేల రూపాయల వేతనంతో?

విజయవాడలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 20 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది.

42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉండగా దివ్యాంగులకు పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం ఐదు సంవత్సరాల సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.80,910 వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. వేర్వేరు పరీక్షలను నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉండగా ఇతరులకు 1500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. 2024 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెపవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 80 వేల రూపాయల కంటే ఎక్కువ వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.