AP: ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం మొదలు పెట్టారా అంటే అవుననే తెలుస్తుంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలలో మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇటీవల ఈయన మాట్లాడుతూ మొదటిసారి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే కార్యకర్తలను దూరం పెట్టాను కానీ జగన్ అనే వ్యక్తి కార్యకర్తల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని తెలిపారు.
కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోండి తిరిగి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఎక్కడున్నా వారికి తగిన శిక్ష పడుతుంది అంటూ భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా తిరిగి రాష్ట్రంలో పార్టీని ఎలా నిలబెట్టుకోవాలి అధికారంలోకి ఎలా రావాలి అనే విషయాలపై కూడా ఈయన సరికొత్త వ్యూహాలను రక్షిస్తున్నారని దానిని అమలు చేసే పనులలో కూడా బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులను తిరిగి తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రిగా కొనసాగినటువంటి సాకే శైలజనాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. నేడు ఈయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఇక సాకే శైలజ నాథ్ తో పాటు, అనంత వెంకట్రామిరెడ్డి తలారి రంగయ్య, ఉన్నారు ఇలా పార్టీలోకి చేరిన అనంతరం శైలజనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చెయ్యడానికి వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య కాలేజీలను పోర్టులను రోడ్లు ప్రైవేటీకరణ చేయడం ఇలాంటి సమయంలో పోరాటం చేయాలి అంటే వైసిపి పార్టీలో ఉంటేనే పోరాటం చేయగలమని ఈయన తెలిపారు.ప్రజల కోసం పోరాటం చేయడానికి బలమైన నాయకత్వం కావాలని, అది జగన్ దగ్గర ఉందని చెప్పారు. మిగిలిన కాంగ్రెస్ నేతలను తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని, తాను సొంతంగా వైసీపీలో చేరానని అన్నారు. త్వరలోనే మరి కొంతమంది కూడా కాంగ్రెస్ నాయకులు వైకాపాలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇకపోతే ఇలా శైలజనాథ్ అన్న చెంతకు చేరటంతో చెల్లి షర్మిలకు ఊహించని తగిలిందని చెప్పాలి.