బంగారు బుల్లోడు: మళ్ళీ హీరోగా కామెడీనే నమ్ముకున్న నరేష్

ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఆఫ్ అడ్రస్ గా ఉన్న నరేష్ ఎన్నో హిట్ సినిమాలు అందించాడు. అలాంటిది ఆ మధ్య ఆ ఆయన సినిమాలు బొత్తిగా ఆడకపోయేసరికి ఆయనకు సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో మహర్షి అంటూ మహేష్ సరసన మెరిశాడు.

ఆ సినిమాలు ఆయన నటన మెచ్చుకున్నా చెప్పుకోదగ్గ సినిమాలు పాత్రలేవీ ఆయనకు రాలేదు. దాంతో కొంత విరామం తీసుకుని మళ్ళీ హీరోగా ‘బంగారు బుల్లోడు’ గా మన ముందుకు రానున్నాడు. ఈ సారీ కామెడీనే నమ్ముకున్న నరేష్ కు కాలం కలిసి వచ్చి హిట్ పడితే మళ్ళీ కెరీర్ ఊపందుకుంటుంది. చూద్దాం ఆయన ఆశ ఫలించి మళ్ళీ మనందరినీ నవ్వించాలని కోరుకుందాం.