ఈ పాత్ర పదేళ్లపాటు గుర్తుంటుంది.. బచ్చలమల్లి పై అల్లరి నరేష్ క్రేజీ కామెంట్స్!

కథానాయకుడు అల్లరి నరేష్ బచ్చల మల్లి సినిమాతో చాలా రోజుల తర్వాత మళ్లీ మన ముందుకి వస్తున్నాడు. అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 20 థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మంగళవారం విలేకరులతో మాట్లాడాడు బచ్చలమల్లి సినిమా 1990, 2005 కాలాల మధ్య సాగే కథ.

ఒక ఊరిలో ట్రాక్టర్ నడుపుకునే వ్యక్తి బచ్చలపల్లి. జీవితంలో ఎవరైనా వద్దు అనుకుంటే ఇక వాళ్లని జీవితకాలం పక్కన పెట్టే ఒక మూర్ఖపు వ్యక్తి కథ. అలాంటి వ్యక్తి జీవితంలోకి హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత అతని జీవితమే మారిపోతుంది. ప్రస్తుతం ఎలాంటి తప్పులు చేయకపోయినా గతంలో చేసిన తప్పులు ప్రస్తుతం అతడిని వెంటాడుతూ ఉంటాయి. అప్పుడు ఏం జరిగింది అనేది సినిమా కధ.

హీరో క్యారెక్టర్జషన్ పాజిటివ్, నెగిటివ్ అనే విషయం పక్కనపెడితే ప్రతి మనిషిలోని ఒక గ్రేషేడ్ ఉంటుంది. అర్జున్ రెడ్డి, కే జి ఎఫ్ సినిమాలు చూసి ప్రేక్షకులు ఏమి మారలేదు అలాగే పుష్ప సినిమా చూసి ఎర్ర చందనం చెట్లు కొట్టడానికి ఎవరూ అడవికి పరిగెట్టలేదు అలాగే బచ్చలపల్లి క్యారెక్టర్ ని కూడా ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరని అనుకుంటున్నాను. గమ్యం సినిమాలో గాలి శీను పాత్రలా ఈ సినిమాలో నా క్యారెక్టర్ పదేళ్లపాటు ప్రేక్షకులకి గుర్తుండిపోతుంది అని చెప్పాడు నరేష్.

మీకు అచ్చొచ్చిన కామెడీ జోనర్ ని పక్కన పెట్టేస్తారా అనే ప్రశ్నకి సమాధానంగా కామెడీ నాకు ఉప్పల్ స్టేడియం లాంటిది, అది నాకు హోమ్ గ్రౌండ్ సీరియస్ సినిమాలతో పాటు కామెడీ సినిమాలు కూడా చేస్తాను అయితే ప్రస్తుత రోజుల్లో ఆర్గానిక్ కామెడీ రాసేవారు తక్కువై పోయారు ఉన్న కొద్దిమందీ డైరెక్షన్ వైపు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం సుడిగాడు 2 కోసం కధ రాస్తున్నాను. పాన్ ఇండియా ఇండియా సినిమాలపై స్పూఫ్ తీస్తాను. నార్త్ ఇండియా సినిమాల ప్రస్తావన కూడా ఈ సినిమాలో ఉంటుంది అని చెప్పాడు నరేష్.