అలాంటి వాళ్లయితే బెటర్.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హనుమాన్ హీరోయిన్!

30 రోజులలో ప్రేమించడం ఎలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటి అమృత అయ్యర్. ఆ తర్వాత రెడ్, లిఫ్ట్ వంటి చిత్రాలలో నటించినా పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. అయితే ఈ సంవత్సరం తేజ హీరోగా సెన్సేషనల్ హిట్ అయిన హనుమాన్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ఫేమ్ ని సొంతం చేసుకుంది అమృత అయ్యర్.

ఈ మూవీ హిట్ అవ్వటంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ. ఇప్పుడు మళ్లీ అల్లరి నరేష్ హీరోగా వస్తున్న బచ్చలపల్లి సినిమాతో మన ముందుకి రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 20 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అమృత అయ్యర్ మాట్లాడుతూ తన పెళ్లిపై లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చింది.

తాను 2025లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను కానీ ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని మాత్రం అస్సలు చేసుకోను ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే సమస్యలు వస్తాయి అనేది నా అభిప్రాయం. వేరే ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇక బచ్చల మల్లి విషయానికి వస్తే ఇందులో అల్లరి నరేష్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

1990 నేపథ్యంలో సాగే ఈ కథలో నరేష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేశారు అయితే హీరోయిన్ అమృత అయ్యర్ ఎంట్రీ తో నరేష్ పాత్రలో చాలా మార్పులు వస్తాయి. నరేష్ అమృతతో ప్రేమలో పడిన తరువాత జరిగిన సంఘటనలు ఏమిటి, కథను మలుపు తిప్పిన విషయాలు ఏమిటి అనేది సినిమా కథ. చాలా రోజుల తర్వాత నరేష్ యాక్టింగ్ హైలెట్ అనిపించింది. అతనికి ఇన్నాళ్ళకి ఒక మంచి బలమైన పాత్ర పడినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకి సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు.