ఇండస్ట్రీ కాంబినేషన్స్ అన్నీ హిట్, ప్లాప్ సెంటిమెంట్ ప్రకారమే నడుస్తాయి. ఏదైనా కాంబినేషన్ హిట్ అయితే దాన్ని మనవాళ్ళు ఎంత సెంటిమెంట్‌గా ఫీలవుతారంటే చెప్పలేనంత. ఒక్కసారి ఒక సెంటిమెంట్ వర్క్ అవుట్ అయిందంటే చాలు దాన్నే పట్టుకువేలాడుతుంటారు. అలాగే ఒక్కసారి ఫ్లాప్ గనుక అయ్యిందంటే తిరిగి దాని మొహం కూడా చూడడానికి ఇస్టపడరు. ట్రేడ్ కూడా ఇందుకు అనుకూలంగా ఉండదు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్లాప్ కాంబినేషన్ కోసం వరసగా ప్రయత్నిస్తూ వచ్చింది.
ఒకటి తర్వాత ఒకటి సినిమాలు ప్లాపవుతూ వచ్చాయి. అయినా సినిమాలను కంటిన్యూ చేసారు. మొత్తానికి హిట్ కొట్టారు. వాళ్లే సాయి ధరమ్ తేజ్, థమన్. ఈ హీరో, సంగీత దర్శకుడు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. సినిమాల పరంగానే కాకుండా బయట కూడా ఇద్దరూ కలిసి తిరుగుతారు. క్రికెట్ బాగా ఆడతారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఇద్దరూ ఇప్పటివరకూ కలిసి నాలుగు సినిమాలు చేసారు. నాలుగు చిత్రాలూ కూడా అట్టర్ ప్లాపులుగా మిగిలాయి.
కానీ వీరిద్దరూ ఎక్కడా తగ్గలేదు సాయి తేజ్, థమన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం తిక్క. పాటలు బాగుంటాయి కానీ సినిమా ఘోరంగా విఫలమైంది. అలాగే జవాన్, విన్నర్ కూడా సాంగ్స్ బాగున్నా సినిమా ఫేట్ మారలేదు. ఇక ఇంటెలిజెంట్ సినిమాకైతే పాటలు కూడా బాగోవు. సినిమా రిజల్ట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి మళ్ళీ పని చేయరేమో అనుకున్నారు. అయితే ప్రతిరోజూ పండగే చిత్రానికి మళ్ళీ పనిచేసారు. పాటలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. సినిమా రిజల్ట్ కూడా అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ రేంజ్ ను అందుకుంటోంది. దీంతో మొత్తానికి ఇద్దరూ కలిసి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసారంటూ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.