అప్పుడే ఓటిటిలో “బ్రో” దర్శనం..ఎందులో అంటే.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రాల్లో తాను నటించిన మరో ఇంట్రెస్టింగ్ అండ్ రీమేక్ మల్టీ స్టారర్ చిత్రమే “బ్రో”. మరి తమ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా యంగ్ హీరోయిన్ కేతిక శర్మ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సముద్రఖని అయితే తెరకెక్కించారు.

కాగా ఈ చిత్రంతోనే సముద్రఖని టాలీవుడ్ కి దర్శకునిగా పరిచయం కాగా ఈ చిత్రం తెలుగులో అయితే అనుకున్న రేంజ్ భారీ సక్సెస్ ఏమి కాలేదు. మరి తెలుగులో అయితే ఈ చిత్రం కేవలం రెండు వారాల్లోనే మొత్తం థియేటర్స్ లో ఖాళీ అయిపోగా ఈ చిత్రం ఇపుడు ఫైనల్ గా ఓటిటికి అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కంప్లీట్ కాని ఈ చిత్రం ఈరోజు ఆగస్ట్ 25 నుంచి అయితే పాన్ ఇండియా భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. దీనితో  చూసినవారు అలాగే చూడని వారు ఉంటె ఈసారి సినిమా మిస్ కాకుండా చూడవచ్చు.

కాగా ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అయితే టిజి విశ్వ ప్రసాద్ నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ రోహిణి, 30 ఇయర్స్ పృథ్వీ కీలక పాత్రలై చేశారు. 
https://twitter.com/KarnatakaPSPKFC/status/1694894284510491050?s=20