ప్రెజెంట్ టాలీవుడ్ వర్గాల్లో మంచి ఆసక్తిగా వినిపిస్తున్న క్రేజీ చిత్రం “బ్రో ది అవతార్” కాగా ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు సినీ వర్గాల్లో సహా పొలిటికల్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
అయితే సినిమా నిర్మాతలు చాలా వరకు కాంట్రవర్సీ లకి దూరంగా ఉంటారు కానీ బ్రో సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. సినిమా రిలీజ్ అయ్యిన మొదటి వారం లోపే సినిమాపై వస్తున్నా కాంట్రవర్సీ పొలిటికల్ ప్రెజర్ లను తిప్పి కొడుతున్నారు.
పైగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు కి స్ట్రాంగ్ వార్నింగ్ ని సింపుల్ గా ఇచ్చేయడం ఇప్పుడు సెంటర్ ఆఫ్ హాట్ టాపిక్ గా మారగా అసలు పవన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు మనకెందుకు గోల అని రిలీజ్ తర్వాత దూరంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం విషయంలో విశ్వ ప్రసాద్ బలంగా నిలబడడం ఆశ్చర్యంగా మారింది.
అయితే అసలు దీనికి కారణం ఏంటా అని ఆరా తీస్తే కొన్ని షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. పవన్ కి విశ్వ ప్రసాద్ కి ఉన్న పరిచయం ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. పవన్ తో గత ఐదేళ్ల కితం నుంచే పరిచయం ఉండగా పవన్ జనసేన పార్టీ కార్య కలాపాల్లో కూడా తాను పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు ఒకొకటిగా బయటకి వస్తున్నాయి.
దీనితో ఈ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతే కాకుండా విశ్వ ప్రసాద్ కి చాలా బలమైన లీగల్ సెల్ కూడా ఉన్న మాట వాస్తవమే అట అందుకే అంబటి విషయంలో తాను ఎలాంటి బెరుకు లేకుండా ఏమన్నా అయితే చూసుకోగలను అలాగే ఏమైనా తేడా చేస్తే వదిలి పెట్టను అనే రేంజ్ లో కామెంట్స్ చేశారు. సో ఇది అసలు మేటర్..