చైతూని ఆవిడైనా గట్టెక్కిస్తుందా?

త్వరలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించటానికి రాబోతున్నాడు అక్కినేని నాగ చైతన్య. ఒకటి సవ్యసాచి, మరొకటి మారుతీ డైరక్షన్లో వస్తున్న శైలజారెడ్డి అల్లుడు. చైతూ చేసిన రీసెంట్ మూవీస్ సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం బాక్స్ ఆఫీస్ వద్ద ఓడిపోయాయి. రారండోయ్ వేడుక చూద్దాం మూవీ కూడా ఓకే అనిపించింది తప్ప సూపర్ డూపర్ హిట్ కాలేదు. ఇప్పుడు చైతన్య ఆశలన్నీ సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడిపైనే పెట్టుకున్నాడు.

సవ్యసాచి సంగతి ఏమో కానీ శైలజారెడ్డి అల్లుడు మూవీకి ఒక లెక్కుంది.. ఈ మూవీలో చైతూ అత్త శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనపడనున్నారు. బాహుబలి 1, బాహుబలి 2 రెండిటి సక్సెస్ లో రమ్యకృష్ణ యాక్టింగ్ కూడా భాగమే అని చెప్పాలి. తన అభినయంతో బాహుబలి మూవీకి మరింత క్రేజ్ పెంచింది. ఇప్పుడు శైలజారెడ్డిలో కూడా తనది అంతే ప‌వ‌ర్‌ఫుల్‌ క్యారెక్టర్ అని పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఆ పోస్టర్ లో రమ్యకృష్ణ కుర్చీలో కూర్చుని ఒక తీవ్రమైన కోపపూరిత హావభావాన్ని కళ్ళలో పలికిస్తుంది. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ తోనే బాహుబలి సినిమాని రక్తి కట్టించింది ఈ నటి.

ఇప్పుడు ఆమె చేస్తున్న శైలజారెడ్డి పాత్రకి కూడా అదే ఎస్సెన్స్ ఉండేలా కథని తీర్చి దిద్దారట దర్శకుడు. మొత్తానికి మరోసారి శివగామిని చూపించనున్నారు ఈ సినిమా ద్వారా. అదే తరహాలో రమ్యకృష్ణ పాత్ర ఉంటే జనాలు థియేటర్ల ముందు క్యూ కట్టడం ఖాయం. దెబ్బకి నాగచైతన్య మూవీ సూపర్ సక్సెస్ బాట పట్టొచ్చు.. ఫ్లాపుల ఊబినుండి గట్టెక్కొచ్చు.