Nagachaitanya: చిరంజీవి మహేష్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చైతు.. దశ తిరిగిపోయిందిగా?

Nagachaitanya: నాగచైతన్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ టు హీరోలలో స్టార్ గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ నాగచైతన్య కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య నటించిన ఏం మాయ చేసావే సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్నారు అయితే ఈ సినిమా తిరిగి జూలై 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో నాగచైతన్య ఫస్ట్ ఆప్షన్ కాదని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా మహేష్ బాబుతో చేయాల్సి ఉండేదట గౌతమ్ మీనన్ ఈ సినిమా స్టోరీ చెప్పిన తర్వాత మన కాంబినేషన్లో అందరూ కూడా యాక్షన్ సినిమాని ఆశిస్తారు ఇది వర్కౌట్ కాదు అంటూ రిజెక్ట్ చేశారట. ఈ సినిమాలో మహేష్ బాబు మాత్రమే కాదు ఇనిషియల్‌ డ్రాఫ్ట్‌లో మెగాస్టార్‌ చిరంజీవికి కూడా ప్రామినెంట్‌ రోల్‌ ఉందట. చిరంజీవి సెట్‌లో పనిచేసే కుర్రాడి ప్రేమకథగా రాసుకున్నారట డైరెక్టర్ గౌతమ్.

ఇక ఈ స్టోరీ మహేష్ బాబుకు చెప్పడంతో ఆయన రిజెక్ట్ చేసారు. ఇక తప్పని పరిస్థితులలో గౌతమ్ మీనన్ హీరో శింబు, నాగచైతన్యను సంప్రదించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా నాగచైతన్య కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సమంత నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా సమయంలోనే సమంత నాగచైతన్య మధ్య పరిచయం ఏర్పడటం ఆపరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లైన మూడు సంవత్సరాలకు ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం నాగచైతన్య తిరిగి శోభితను రెండో పెళ్లి చేసుకున్న సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు.