Nagarjuna -Nagachaitanya: మంత్రి కొండా సురేఖ వివాదం… కోర్టు మెట్లు ఎక్కిన నాగార్జున, చైతూ!

Nagarjuna -Nagachaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో నటుడు నాగార్జున ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అయితే తాజాగా నాగార్జున పరువు నష్టం దావా కేసులో భాగంగా కోర్టుకు వెళ్లడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. గతంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతో వివాదాస్పదంగా మారాయి ఈ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించారు.

ఇలా మంత్రి కొండ సురేఖ సమంత నాగచైతన్యల విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలను నాగార్జున నాగచైతన్య ఇద్దరు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య నాగార్జున మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో నాగార్జున వెనక్కు తగ్గుతారేమోనని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం ఈ పరువు నష్టం దావా విషయంలో ఏకంగా కోర్టుకు కూడా హాజరయ్యారు.

 

ఇక నాగార్జున , నాగ చైతన్య ఇద్దరు కూడా తాజాగా ఎందుకు పరువు నష్టం దావా వేశారనే దానిపై వీరిద్దరూ తమ స్టేట్మెంట్లను కోర్టుకు సమర్పించవలసి ఉంటుంది.తాజాగా వీరిద్దరు కూడా ఎందుకు పరువు నష్టం దావా కేసు వేసాము అనే దానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు సమర్పించారు. ఇలా నాగార్జున , నాగ చైతన్య ఇద్దరు కూడా కొండా సురేఖ పై పెట్టిన కేసు విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ముందుకు వెళుతున్నారు. మరి ఈ విషయంలో కోర్టు ఎలాంటి తీర్పును ప్రకటిస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే కొండా సురేఖ నాగచైతన్య సమంత విడాకులు గురించి మాట్లాడుతూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ కారణంగానే వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రదుమారం రేపాయి. సమంత నాగచైతన్య ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయి ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య శోభితను రెండవ వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు సమంత మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు అయితే త్వరలోనే సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది.