Nagachaitanya: అక్కినేని హీరోలు ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య తండేల్ సినిమా ద్వారా సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక నాగార్జున కూడా ఇటీవల కూలీ కుబేర వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక నాగచైతన్య తన 24వ సినిమా షూటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే 25వ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడి డైరెక్షన్లో నాగచైతన్య సినిమా చేయబోతున్నారని సమాచారం.
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి మధ్య చర్చలు కూడా జరిగాయని కథ నచ్చిన నాగచైతన్య ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా యంగ్ హీరోయిన్ మమితా బైజు హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తి కావడంతో కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇకపోతే గత కొద్దిరోజులుగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించాల్సిన దేవర 2 సినిమా క్యాన్సిల్ అయ్యిందని అదే కథతో నాగచైతన్యతో సినిమా చేస్తున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి మరి దేవర 2 కథతోనే కొరటాల నాగచైతన్యతో సినిమా చేయబోతున్నారా లేదంటే కొత్త కథ చేయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీపసాద్ సంగీతం అందించబోతున్నారని, ఈ సినిమా సోషల్ థ్రిల్లర్‌తో కూడిన కళాశాల ప్రేమకథగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ త్వరలో ఇవ్వనున్నట్లు సమాచారం.
