Sobhita -Nagachaitanya: శోభిత నాగచైతన్య మరోసారి వార్తల్లో నిలిచారు. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ వీరిద్దరి వివాహం కొంతమంది అతిథులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది.
ఇలా సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను పెళ్లి చేసుకోవడంతో కొద్దిరోజులు వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరోసారి శోభిత తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఇలా శోభిత నాగచైతన్య పెళ్లైన వెంటనే పిల్లల్ని కావాలని కోరుకున్నారని అందుకే ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులుగా మారబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇలా సమంత నాగచైతన్య తల్లిదండ్రులుగా మారబోతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలు విని అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా అక్కినేని ఫాన్స్ సమంత కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఈ వార్తలపై నాగచైతన్య టీం స్పందించారని తెలుస్తోంది.
శోభిత ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని, ఇదంతా అవాస్తవమేనని తెలియజేశారు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే స్వయంగా వారే స్పందిస్తారని తెలిపారు. ప్రస్తుతం శోభిత నాగచైతన్య ఇద్దరు కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఇటీవల నాగచైతన్య తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.