మంత్రి జగదీష్ కు కేసిఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ విద్యుత్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి సిఎం కేసిఆర్ జన్మదినశుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం జగదీష్ రెడ్డి కేసిఆర్ నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డికి పూలబొకే ఇచ్చి సిఎం శుభాకాంక్షలు తెలిపారు.

నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు జోరుగా జరుపుతున్నారు. ఓయు జెఎసి నేత బాలరాజు యాదవ్ మంగళవారమే ఉస్మానియాలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద జగదీష్ రెడ్డి జన్మదినాన్ని సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేసి హడావిడి చేశారు.