కే‌సి‌ఆర్ బంపర్ హామీతో హైదరబాద్ లో అందరూ వామ్మో అనుకుంటున్నారు !

everyone in hyderabad shocks with kcr offers and assurance

ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ వరద ముంపునకు గురవుతోందని అన్నారు. హైదరాబాద్‌లో ఈ సమస్య పరిష్కరించేందుకు ఏడాదికి రూ.10 వేల కోట్లు బడ్జెట్‌లో కచ్చితంగా కేటాయిస్తామని అన్నారు. హైదరాబాద్ నగరం అశాస్త్రీయంగా పెరిగిపోయిందని, నలువైపులా విస్తరించిపోయిందని అన్నారు. బస్తీలు, వాడలు ఎలాపడితే అలా పెరిగిపోయాయని గుర్తు చేశారు. ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ హైదరాబాద్‌లోని వరద సమస్య గురించి మాట్లాడారు.

everyone in hyderabad shocks with kcr offers and assurance
KCR

‘‘ఇండియాలో వరదలు రాని నగరమే లేదు. మద్రాసు, బెంగళూరు, దిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లోనూ వరదలు వచ్చాయి. మన దురదృష్టవశాత్తు మన హైదరాబాద్‌కు కూడా వరదలు వచ్చాయి. మన మంత్రులు కూడా మోకాళ్లలోతు నీళ్లలో తిరిగారు. ఎంతో మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి నాకు కళ్లలో నీళ్లు వచ్చాయి. వెంటనే నేను బాధితులందరికీ రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించా. ఏ నగరంలోనూ ఇవ్వలేదు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట కూడా ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం ఇవ్వనట్లు ఆరున్నర లక్షల కుటుంబాలకు 650 కోట్ల జారీ చేశాం. దీనిమీద కూడా కొంత మంది కిరికిరి పెడుతున్నారు. అందుకే మేం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కోరాం.’’ అని కేసీఆర్ అన్నారు.

‘‘హైదరాబాద్ ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నా. ఇంకా నాలుగు రోజులైతే ఎన్నికలు అయిపోతయ్. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికీ ఉంటది. ఇంకా ఎంత మంది ప్రజలు మిగిలి ఉన్నారో వారందరికీ డిసెంబరు 7 నుంచి మళ్లీ రూ.10 వేల సాయం అందిస్తాం. బాధపడ్డ, అర్హులైన ప్రతి ఒక్కరికీ మేం వరద సాయం అందిస్తాం.’’ అని కేసీఆర్ వివరించారు.