డిఎస్ కొడుకుపై నిర్భయ కేసు.. అజ్ఞాతంలో సంజయ్

తెలంగాణలో సంచలనం.. అధికార టిఆర్ఎస్ పార్టీ నేత కొడుకు మీద ప్రభుత్వం నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసింది. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ధర్మపురి సంజయ్ మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు.  సంజయ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన అజ్జాతంలోకి వెళ్లిపోయారు. ఏ క్షణంలోనైనా సంజయ్ ని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. సంజయ్ ను అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఇప్పుడు గాలిస్తున్నారు. మరోవైపు సంజయ్ హైదరాబాద్ వచ్చి గయబ్ అయ్యారు. 

నిజామాబాద్ లోని శాంకరి నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిల పట్ల సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. వారు ఏకంగా హైదరాబాద్ కు వచ్చి ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య నాయకత్వంలో సచివాలయానికి వచ్చి హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న హోంమంత్రి నాయిని డిజిపి మహేందర్ రెడ్డితో మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవావలని ఆదేశాలిచ్చారు. 

ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ వేగవంతం చేశారు. 24 గంటల్లోనే ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు సంజయ్ మీద నిర్భయ యాక్ట కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు వేట మొదలు పెట్టారు. అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సంజయ్ శుక్రవారం మధ్యాహ్నం మీడియాకు చెప్పారు. తన మీద కావాలని కొందరు కుట్ర చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తను ఎవరితోనూ సహజీవనం చేయడంలేదని, తనకు భార్య బిడ్డలు ఉన్నారని చెప్పుకున్నారు. 

ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నది. టిఆర్ఎస్ లో ఉండాలోొ పోవాలో తేల్చుకోలేక సతమతమవుతున్న డిఎస్ కు ఈ సంఘటన ఊహించని షాక్ గా తగిలింది. ఇందులో ఎవరి ప్రమేయం  ఎంత మేరకు ఉన్నప్పటికీ డిఎస్ కొడుకు వ్యవహార శైలి వల్ల డిఎస్ ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. ఇప్పుడు డిఎస్ టిఆర్ఎస్ లో ఉన్నా పోయినా పెద్దగా ఒరిగే నష్టం లేదని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. 

సంజయ్ వేటలో పోలీసులు :

సంజయ్ ను వేటాడేందుకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగు బృందాలు సంజయ్ ని అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారు ఇప్పటికే నిజామాబాద్ లోని సంజయ్ ఇంటికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేడని తెలుసుకున్నారు. సంజయ్ నిజామాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. విచారణకు తాను సిద్ధమని ప్రకటించారు. తర్వాత అక్కడి నుంచి సంజయ్ నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. తన మీద కేసులు నమోదైనట్లు తెలియగానే సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి పెట్టుకున్నారు. సంజయ్ మీద నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నిర్భయ తోపాటు బెదిరింపుల కింద 354, 354ఎ,  356, 342 సెక్షన్ల కింద లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. సంజయ్ అరెస్టు ఖాయంగా కనబడుతున్నది.

 

సంజయ్ మీద లైంగిక ఆరోపణల ఫిర్యాదు, సచివాలయంలో విద్యార్థినిల ఫిర్యాదు తాలూకు వార్తా కథనం:  
https://telugurajyam.com/trs-mp-d-srinivas-son-face-sexual-harassment-complaints/