టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో సీబీ’ఐ’: అసలేం జరిగిందంటే.!

CBI Raids On TRS MP's House

CBI Raids On TRS MP's House

ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ.. ఢిల్లీలోని ఆమె నివాసంలో సీబీ’ఐ’ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు ‘రెడ్ హ్యాండెడ్’గా దొరికేశారట.. అదీ లక్ష రూపాయల లంచం పుచ్చుకుంటూ. సీబీఐ, నిందితుల్ని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్ ఎంపీకి అత్యంత సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది. సన్నిహితుడు కాదు.. అనుచరుడంటున్నారు. అబ్బే, అదేం కాదు.. సదరు ఎంపీకి అన్నీ తానే అయి వ్యవహరిస్తుంటాడనీ, లావాదేవీలు నిర్వహిస్తుంటాడనీ సోషల్ మీడియాలో బోల్డన్ని కామెంట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై సదరు ఎంపీ స్పందించారు. తాను తెలంగాణలోనే వున్నాననీ, కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి వస్తున్నానంటూ మార్గమధ్యంలోనే వీడియో కాల్ ద్వారా మీడియాకి అందుబాటులోకి వచ్చారు.

జరిగిన ఘటన గురించి తాను కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నానంటోన్న ఎంపీ మాలోతు కవిత, సదరు నిందితుడు దుర్గేష్ తన వద్ద కారు డ్రైవర్ అని చెప్పారు. ఢిల్లీలోని తన నివాసాన్ని ఇంకా పూర్తిస్థాయిలో వినియోగించడంలేదనీ, ఆ ఇంటి నిర్వహణ బాధ్యతలు మాత్రమే అతనికి అప్పగించాననీ చెబుతున్నారు. దుర్గేష్ గనుక నేరం చేసి వుంటే, అతనిపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను సమర్థిస్తాననీ చెప్పుకొచ్చారు. ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మాలోతు కవిత. మరోపక్క, దొరికింది కేసీఆర్ కుమార్తె కవిత.. అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఆ కవిత కాదు.. ఈ కవిత కాదు.. అసలు కథ వేరే.. అంటూ అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతుండడం గమనార్హం.