టిఆర్ఎస్ పద్మా దేవేందర్ రెడ్డికి నిరసన భగీరథ (వీడియో)

తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్లు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగదని గులాబీ దళపతి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. బయట అనేక సభలల్లో కూడా ఇదే చాలెంజ్ విసిరారు. ఏ గ్రామములోనైనా ఆడబిడ్డ బిందె చేతపట్టుకొని బయట కనిపిస్తే ఆ గ్రామ సర్పంచ్, ఎంపిటిసిని సస్పెండ్ చేసే విధంగా కార్యచరణ రూపొందిస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. మిషన్ భగీరధ నీళ్లేమే కానీ గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు లేదని మెదక్ నియోజకవర్గంలోని మహిళలు ఆందోళన వ్యక్తం చేసి నిరసన భగీరథ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.

మెదక్ నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్ధి, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా నిరసన సెగ తగిలింది. మెదక్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తమకు నీళ్లు లేవని , ట్యాంకులు లేవని పద్మా దేవేందర్ రెడ్డి ముందు ఖాళీ బిందెలు పెట్టి నిరసన తెలిపారు.

మిషన్ భగీరధ పనులు జరుగుతున్నాయని త్వరలోనే ఇంటింటికి నీళ్లు వస్తాయని పద్మా ఆందోళన కారులకు తెలిపింది. నీళ్లు ఇచ్చినంకనే ఓట్లడుగుతాం అని చెప్పి ఇప్పుడేలా అడుగుతున్నారని వారు నిలదీశారు. దీంతో నిరసనకారులకు సమాధానం చెప్పేందుకు పద్మా దేవేందర్ రెడ్డి తడబడ్డారు. పద్మా దేవేందర్ రెడ్డిని అడ్డుకున్న వీడియో కింద ఉంది చూడండి.  

 

padhma devender reddy