కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో జగన్‌

(PK)

బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తాను ప్రతిపాదించిన ఫెడరల్‌ఫ్రంట్‌ను ముందుకెళ్లి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కేసీఆర్‌ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయోననే ఆసక్తి నెలకొంది. కేసీఆర్‌ఫెడరల్‌ఫ్రంట్‌లో ఎవరెవరు ఉంటారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ఒవైసీ ఒక్కరే కేసీఆర్‌వెంట ఉన్నా జగన్‌మోహన్‌రెడ్డి ఆయనతో జతకట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్, జగన్‌మధ్య దీనిపై ప్రాథమికంగా ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రాలో త్వరలో ఎన్నికల పరీక్షలు రాయనున్న జగన్‌ఇప్పటికిప్పుడు దీనిపై బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఆయన మద్ధతు కేసీఆర్‌కేనని ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి అర్థమవుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అదేమిటి జగన్‌బీజేపీ మనిషి కదా అనే అనుమానం చాలామందికి రావచ్చు. మోడీకి జగన్‌పట్ల సాఫ్ట్‌కార్నర్‌ఉన్నమాట నిజమే అయినా అది ఆయనతో కలిసి పనిచేసే స్థాయిలో లేదట. ఏపీలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదగాలంటే జగన్‌ను కలుపుకోవాలని మొదట్లో భావించినా ఆ రెండు పార్టీల సాంప్రదాయ ఓటు బ్యాంకు పరస్పర విరుద్ధంగా ఉండడం, జగన్‌స్వతంత్య్ర వైఖరితో మోడీ మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. అవసరమైతే జగన్‌ను పరోక్షంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకోచ్చు కానీ నేరుగా అతనితో కలిసి పనిచేసే పరిస్థితులు లేవని నిర్థారించుకున్నట్లు సమాచారం. అంటే కేసీఆర్‌మాదిరిగా జగన్‌తో తెరవెనుక మిత్రత్వానికి బీజేపీ ఆసక్తి చూపుతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్‌చెబుతున్న ఫెడరల్‌ఫ్రంట్‌వల్ల లబ్ది పొందేది బీజేపీయే. ఎందుకంటె చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చాలని తాపత్రయ పడుతున్నారు. రాష్ట్రాలకు స్వతంత్య్ర ప్రత్తిపత్తి పేరుతో కేసీఆర్‌వాటిలో చీలికకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మాటల్లోని భావం కూడా అలాగే కనిపిస్తోంది. మేం పరిపాలించుకోలేమా, మాకు పాలన చేతకాదా అని ప్రశ్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్‌రెండింటి మధ్య సమన్యాయం పాటిస్తున్నట్లు ఇండికేషన్లు ఇస్తున్నారు. అంటే మున్ముందు ఆ రెండు పార్టీలతో సరిపడని పార్టీలతో ఒక జట్టుగా ఏర్పడాలనేది కేసీఆర్‌వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో కచ్చితంగా జగన్‌ఉండే అవకాశం ఉంది. తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌కు ఫ్రంట్‌లో జగన్‌సహా నాలుగైదు పార్టీలు కలిసినా వాటి కూటమికి 50, 60 సీట్లు ఉంటాయనేది ఆయన అంచనా. ఆ స్థానాలతో ఢిల్లీలో చక్రం తిప్పవచ్చనేది కేసీఆర్‌ఆలోచనగా ఉంది.

మరోవైపు మోడీ కూడా ఇది తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎన్డీఏ బలం సరిపోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఈ ఫెడరల్‌ఫ్రంట్‌తనకు అక్కరకు వస్తుందని, రాహుల్‌కూటమి బలపడకుండా ఉండేందుకు ఆసరగా ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ కేసీఆర్‌లెక్కలు రెండున్నాయి. ఒకటి తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టిన చంద్రబాబుకు ఝలక్‌ఇవ్వడం, రెండోది జాతీయ రాజకీయాల్లోనూ ఎవరో ఒకరి పక్షాన లేకుండా వెళ్లి ఎన్నికల తర్వాత చక్రం తిప్పడం. బహుశా చంద్రబాబుకు కేసీఆర్‌ఇస్తానన్న రిటర్న్‌గిఫ్ట్‌కూడా ఇదే అయిఉండవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే బాబు బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి తాను గట్టెక్కాలని చూస్తేంటే కేసీఆర్‌వాటిని చీల్చే పనిలో ఉన్నాడన్నమాట. అంటే ఇందులో జగన్‌పాత్ర కూడా ఉండబోతోందని అర్థమవుతోంది.