తెలంగాణ నిరుద్యోగులకు టిఎస్‌పీఎస్సీ షాక్

తెలంగాణ నిరుద్యోగులకు టిఎస్ పీఎస్సీ  షాకిచ్చింది. సెప్టెంబర్ 2న మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలు జరగాల్సి ఉంది. సెప్టెంబర్ 2న టిఆర్ ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ ఉన్నందున అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా ఆ రోజు జరిగే పరీక్షను వాయిదా వేస్తున్నట్టు టిఎస్ పీఎస్సీ ప్రకటించింది.  సభ ఉన్నందున రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలుగుతుందని అలాగే ట్రాఫిక్ జామ్ తో అభ్యర్థులకు ఇబ్బంది అవుతుందని టిఎస్ పీఎస్సీ ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షను సెప్టెంబర్ 3 వతేదిన నిర్వహిస్తామని టిఎస్ పీఎస్సీ తెలిపింది.

సెప్టెంబర్ 2న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయడంతో అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సభ కోసం పరీక్షను వాయిదా వేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. టిఎస్ పీఎస్సీ రాజ్యాంగబద్ద సంస్థ అని, సభ కోసం పరీక్ష వాయిదా వేసి టిఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా టిఎస్ పీఎస్సీ వ్యవహరిస్తుందని వారు విమర్శించారు. నెలల తరబడి ప్రిపేర్ అవుతున్నామని ఇప్పుడు వాయిదా వేసి ఇబ్బంది పెట్టడమేంటన్నారు. పరీక్ష వాయిదా వేయకుండా అవసరమైతే సభే వాయిదా వేసుకోవాలని నిరుద్యోగ అభ్యర్థులు అన్నారు. టిఎస్ పీఎస్సీ విడుదల చేసిన ప్రకటన కింద ఉంది చూడండి.