టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక చైర్మన్ గా కృష్ణారెడ్డి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) చైర్మన్, పలువురు సభ్యుల పదవీ కాలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాత్కాలిక ఛైర్మన్‌గా డి. కృష్ణారెడ్డిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. టీఎస్పీఎస్సీకి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించే వరకు ఈ పదవిలో కృష్ణారెడ్డి కొనసాగనున్నారు.

TSPSC: టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక చైర్మన్ గా కృష్ణారెడ్డి నియామకం.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్

కృష్ణారెడ్డి ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి, పలువురు సభ్యుల పదవీ కాలం ముగియడంతో వారి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే నెలలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్న తరుణంలో నియామక ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులకు ఏ దశలో కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఈసారి నియామక ప్రక్రియని మరింత సరళం చేసేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించాలని   యోచిస్తోంది.