కేసీఆర్ కు తెలంగాణ ఉన్నతాధికారుల షాక్

తెలంగాణ స్థానికత కలిగిన దళిత, గిరిజన, మైనార్టీ, బిసి  ఐఏఎస్‌లంతా ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్రాధాన్య పోస్టుల్లో దళిత, గిరిజన, మైనార్టీ స్థానిక ఐఏఎస్ లను పెట్టి ఉత్తరాది వారికి, ఓసీ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ లో వారంతా అత్యవసర సమావేశమయ్యారు. తెలంగాణ కు చెందిన 21 మంది ఐఏఎస్ ఆఫీసర్లను దిక్కుమాలిన పోస్టులలో నియమించారని, సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడిందని వారు చర్చించారు.

కావాలనే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి ఆఫీసర్ల పై వివక్ష చూపించి ఓసీలకు, ఉత్తరాధి వారికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ ల సంఘానికి సమస్యలు చెప్పిన పట్టించుకోలేదని, సీఎస్ ని కలిసినా సమస్యలు పరిష్కారం లేదన్నారు. గతంలో సమస్యలు వస్తే సీనియర్ ఐఏఎస్ లు ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే వారని కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదన్నారు. ఓసీ కులాల నుండి ఐఏఎస్ లు కానీ వారిని కూడా ఉన్నత స్థానాల్లో నియమించారని వారు విస్మయం వ్యక్తం చేశారు.

ప్రత్యేకంగా టార్గెట్ చేసి 6గురు ఎస్సీ, ఎస్టీ, బిసి ఐఏఎస్ అధికార్లను సెక్రటేరియట్ లో గుమస్తాలాంటి పోస్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉంచుతున్నారని, అంతటి వివక్ష ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకని వారు చర్చించుకున్నారు. సమావేశమైన 21 మందిలో ఎస్సీలు ముగ్గురు, ఎస్టీలు ఆరుగురు, బీసీలు 9 మంది, మైనార్టీలు ముగ్గురు ఉన్నారు.

తెలంగాణలో తొలి లంబాడ ఐఏఎస్ మహిళా భారతి నాయక్ ను నాలుగేళ్లుగా సచివాలయంలో గుమస్తా లాంటి పోస్టులో వేశారని , దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఉద్దేశ్య పూర్వక వివక్ష తెలంగాణలో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ప్రభుత్వాలు అనుసరించిన అన్ని విధానాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. బంగారు తెలంగాణ అభివృద్దిలో భాగస్వామ్యం చేస్తారనుకుంటే దిక్కుమాలిన పోస్టులు ఇచ్చి అవమానించడాన్ని ఏమనుకోవాలని వారు ప్రశ్నించారు. చివరకు ఆంధ్రా ఆఫీసర్లకు కూడా మంచి పోస్టింగ్ లు ఇచ్చి తెలంగాణ వారిని అవమానించడం ఉద్దేశ్యపూర్వకమేనన్నారు. 

తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సరైన వేదిక లేదన్న అభిప్రాయంతో ఉన్న ఈ ఐఏఎస్‌ అధికారులంతా కలసి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐఏఎస్‌ ఆఫీసర్ల సంఘం ఏర్పాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకటి రెండు రాష్ట్రాలలో ఇలాంటి సంఘాలు ఉన్నట్లు ప్రస్తావనకు వచ్చింది. ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించారు. కొత్త సంఘానికి ఒక దళిత ఐఏఎ్‌సను అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐఏఎ్‌సలకు ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే ఈ సంఘం స్పందించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ సమావేశానికి 21 మందికి పైగా తెలంగాణ IAS అధికారులు హాజరయ్యారు.

 

 దిక్కుమాలిన పోస్టు లలో వున్న తెలంగాణ స్థానిక (NATIVE) IAS ఆఫీసర్లు.

(1). భూసాని వెంకటేశ్వర్లు (BC).

(2). RV చంద్రవదన్ (BC)

(3).  B వెంకటేశం (BC)

(4). L శశిధర్  (BC)

(5). డా అశోక్ (SC)

(6). M వీరబ్రహ్మయ్య (BC)

(7). అనిత రాజేంద్ర (BC)

(8). దినకర్ బాబు (BC)

(9). G కిషన్ (BC)

(10). MD అబ్దుల్ ఆజీమ్ (మైనార్టి)

(11). K నిర్మల (OC)

(12). L శర్మన్ (ST)

(13). A మురళి (SC)

(14). M చంపాలల్ (ST)

(15). భారతి నాయక్ (ST)

(16). KY నాయక్ (ST)

(17). DV రావు (ST)

(18). అరవిందర్ సింగ్ (మైనారిటీ)

(19). K లక్ష్మి (ST)

(20). బాల మాయదేవి (SC)

(21). అమెయ్ కుమార్ (BC)

 

NoN – IAS and Retired అఫీసర్లకు IAS పోస్టులు ఇచ్చిన వారి పేర్లు.

(1). వెంకట్రామ‌రెడ్డి – కమీషనర్  ( Horticulture) (ఇతను రిటైర్డ్ అఫీసర్ కు 7 పోస్టులు ఇచ్చారు).

(2). గోపాల్ రావు (వెలమ) (12 సంవత్సరాల క్రితం రిటైర్డ్ ఇంజనీర్) – CMD/SPCDL , వరంగల్.

(3). నరసింహ రెడ్డి – MD పరిశ్రమల కార్పోరేషన్

(4). మనోహర్ MD Tourism Corporation

(5). వేణుగోపాల్ (MD అరోగ్య మరియు వైద్య మౌలిక వసతులు కార్పొరేషన్

(6). రఘురామ‌రెడ్డి (రిటైర్డ్ ఇంజనీర్) – CMD – NPDCL

(7). సత్యనారాయణ (రిటైర్డ్ ఇంజనీర్ ) ED Metro Water Works.

(8). కేశవులు – MD Seed Devp.Corp.

(9). అదే కోవలో ఉద్యాన శాఖ కమీషనర్ వెంకటరామిరెడ్డి పదవీ వరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ అదే పదవిలో కూర్చొబెట్టిందన్నారు.

ఐఏఎస్ అధికారుల అత్యవసర సమావేశంతో ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష బయటపడింది. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం, టిఆర్ ఎస్ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయోనని అంతా చర్చించుకుంటున్నారు.