తెలంగాణ నూతన మంత్రులు వీరే… మంత్రుల లిస్ట్ ఫైనల్ చేసిన కేసీఆర్

తెలంగాణ కేబినేట్ విస్తరణ పై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు రాజ్ భవన్ లో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నూతన మంత్రులకు ఇప్పటికే సీఎం కేసీఆర్ సమాచారమందించారు. ప్రమాణ స్వీకారానికి రావాలని ఏ క్షణంలోనైనా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీఎం పిలుపుతో తలసాని, ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్ వచ్చి ప్రగతి భవన్ లో కేసీఆర్, కేటిఆర్ లను కలిశారు.

అయితే మంత్రి పదవి ఆశించి రాని వారికి కూడా కేసీఆర్ ఫోన్ చేసి బుజ్జగించినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే నేతలెవరు లేకపోవడంతో మంత్రి వర్గ విస్తరణ సజావుగా సాగబోతుంది. మరో దఫాలో మరికొంత మందికి స్థానమిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.  

నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేది వీరే 

  1. తలసాని శ్రీనివాస్ యాదవ్
  2. గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి
  3. ఇంద్రకరణ్ రెడ్డి
  4. కొప్పుల ఈశ్వర్
  5. ఎర్రబెల్లి దయాకర్ రావు
  6. నిరంజన్ రెడ్డి
  7. ప్రశాంత్ రెడ్డి
  8. శ్రీనివాస్ గౌడ్
  9. పద్మా దేవేందర్ రెడ్డి పేరు వినిపిస్తున్నా ఇంకా ఫైనల్ కాలేదు.

పద్మా దేవేందర్ రెడ్డి పైన క్లారిటి లేదు. మిగిలిన వారంతా కూడా మంగళవారం ఉదయం తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరికి ఏ పదవులు కేటాయిస్తారనే దాని పై క్లారిటి లేదు. లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి కేబినేట్ విస్తరణ జరగనుంది. ఈ దఫా లో హరీష్ రావు, కేటిఆర్ లకు అవకాశం లేదని స్పష్టమైంది. ఈటెల రాజేందర్ కు కూడా ఈ దఫాలో చోటు లభించకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటిఆర్, లక్ష్మారెడ్డిలకు మంత్రి పదవులు రాకపోవడంతో అంతటా చర్చనీయాంశంగా మారింది.