టిల్లూ క్యూబ్‌లో పూజా హెగ్డే!

అగ్ర కథానాయిక పూజాహెగ్డేకు గత కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో ఈ భామ కెరీర్‌ సాగుతున్నది. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌నిచ్చి కుటుంబ సభ్యులతో విరామ సమయాల్ని గడుపుతున్నది. తాజా సమాచారం ప్రకారం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడు ఓ గుడ్‌న్యూస్‌ను అందుకున్నట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళితే..టిల్లు, టిల్లు స్వేర్‌ చిత్రాలు యువతరంలో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. టిల్లు పాత్రలో హీరో సిద్ధు జొన్నలగడ్డ తనదైన మేనరిజమ్స్‌, హైదరాబాదీ కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు తెలిసింది. డీజే టిల్లు, టిల్లు స్వేర్‌ చిత్రాల్లో కథానాయిక పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో భాగంలో పూజహెగ్డేను కథానాయికగా తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.